Headlines
ktr

కేటీఆర్ అరెస్ట్ తప్పదా?

తెలంగాణాలో చలికాలంలో రాజకీయాల వేడిని పుట్టిస్తున్నది. మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ తప్పదా? అనే చర్చ అంతటా వినిపిస్తున్నది. హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటీషన్ తిరస్కరణతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసును ఏసీబీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. కేటీఆర్ విచారణ కోసం ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. హైకోర్టు నిర్ణయం పై కేటీఆర్ సుప్రీంను ఆశ్ర యించారు. ఇదే సమయంలో హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులతో ఏసీబీ అఫీషియల్స్ భేటీ కావటంతో ఉత్కంఠ మొదలైంది. కేటీఆర్ అరెస్ట్ ప్రచారం వేళ ప్రతీ పరిణామం ఆసక్తి కరంగా మారుతోంది.


విచారణకు హాజరైన అరవింద్ కుమార్
ఫార్ములా-ఈ కారు రేసు కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏసీబీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరయ్యారు. అటు హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించింది.

దీంతో, కేటీఆర్ సుప్రీంలో అప్పీల్ చేసారు. దానిపై రాష్ట్ర ప్రభుత్వం కేవియట్‌ దాఖలు చేసింది. ఇటు తాను ఏసీబీ విచారణకు వెళ్లేందుకు న్యాయవాదికి అనుమతి ఇవ్వాలని ఈ రోజు హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేయనున్నారు. రేపు (గురువారం) విచారణకు రావాలంటూ ఏసీబీ ఇప్పటికే కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది.

ఒకవేళ అరెస్టులు జరిగితే?

పోలీసు అధికారులతో ఈ కేసులో అప్రూవర్‌గా మారతానంటూ ఇప్పటికే ఆయన ప్రభుత్వానికి సమాచారం ఇవ్వటం తో ఈ రోజు అరవింద్ కుమార్ ఇచ్చే సమాచారం కీలకంగా మారనుంది. ఇదే కేసులో ఈడీ అధికారులు కేటీఆర్‌ను ఈ నెల 16న విచారణకు రావాలని తాజాగా సమన్లు జారీ చేశారు. విచారణ .. అరెస్ట్ ల దిశగా అడుగు లు వేస్తున్న వేళ ఏసీబీ ఉన్నతాధికారుల నుంచి వారికి కొన్ని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. హైదరాబాద్‌ కమిషనర్‌తో కూడా ఏసీబీ ఉన్నతాధికారులు మాట్లాడినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Nanette barragan criticized president biden over reports he’s considering executive action at the border. For details, please refer to the insurance policy. Kepala bp batam ajak seluruh elemen masyarakat kompak bangun kemajuan daerah.