Headlines
మహిళల ప్రీమియర్ లీగ్‌కు రంగం సిద్ధం..

మహిళల ప్రీమియర్ లీగ్‌కు రంగం సిద్ధం..

ఈ టోర్నమెంట్ 2025 ఫిబ్రవరి 6 లేదా 7 నుంచి ప్రారంభం అవుతుంది. ఈసారి టోర్నీ వేదికలపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంది. అందులో, ఫైనల్ మ్యాచ్‌ కోసం బరోడాను ఎంచుకునే అవకాశం ఉంది.WPL తొలి రెండు సీజన్లు విజయవంతంగా ముగిశాయి, ఇప్పుడు మూడో సీజన్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.వేలం ప్రక్రియ పూర్తయిన తర్వాత, బీసీసీఐ వేదికలపై చివరి నిర్ణయం తీసుకుంది. ఈసారి లక్నో మరియు బరోడా వంటి నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.అయితే, ఈ వేదికలు మరియు మ్యాచ్‌ల తేదీలపై బీసీసీఐ అధికారిక ప్రకటన ఇప్పటివరకు చేయలేదు.అయితే, క్రిక్బజ్ నివేదిక ప్రకారం, బీసీసీఐ WPL 2025 మూడవ సీజన్‌ కోసం బరోడా మరియు లక్నో వేదికలను ఎంపిక చేసింది.

wpl retention 2025
wpl retention 2025

టోర్నీ నిర్వహణపై యూపీ క్రికెట్ అసోసియేషన్ మరియు బరోడా క్రికెట్ అసోసియేషన్‌తో చర్చలు జరుగుతున్నాయి.ఈ రెండు నగరాలను బీసీసీఐ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.ఈ సీజన్‌లో బరోడాలో 2వ దశ జరిగే అవకాశముంది.బరోడాలో జరిగే ఫైనల్ మ్యాచ్ మార్చి 8 లేదా 9 న జరగవచ్చు. ఫైనల్‌కి ఈ నగరమే ఆతిథ్యం ఇవ్వవచ్చు.బరోడా,కోటంబీ స్టేడియంలో ఇటీవల అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేసినది. అక్కడ, భారత్ మరియు వెస్టిండీస్ మహిళల జట్లు 3 వన్డే మ్యాచ్‌లు ఆడాయి.సీనియర్ మహిళల టీ20 టోర్నమెంట్‌లో కూడా ఈ మైదానంలో పలు మ్యాచ్‌లు జరిగాయి. అదేవిధంగా,రంజీ ట్రోఫీ వంటి దేశవాళీ క్రికెట్ కూడా అక్కడ జరిగింది.మొత్తంగా, WPL 2025 కోసం బీసీసీఐ చేస్తున్న ఏర్పాట్లు క్రికెట్ అభిమానుల కోసం ఆసక్తికరమైనవిగా ఉన్నాయి. WPL మూడవ సీజన్‌ వేగంగా ఆరంభమవుతుండడంతో, ఈ వేదికలపై అంచనాలు భారీగా పెరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Discover lexington country club homes for sale in fort myers florida. Icomaker. Basic implements by domestic helper | 健樂護理有限公司 kl home care ltd.