Headlines
Sharmila comments on Prime Minister Modi visit to AP

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని ప్రధానితో చెప్పించండి: షర్మిల

అమరావతి: అమరావతి : ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రాష్ట్ర ప్రత్యేక హోదాపై ప్రకటన చేయించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ట్విటర్‌ వేదిక ద్వారా డిమాండ్ చేశారు. విభజన హామీలపై క్లారిటీ ఇప్పించాలని, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని మోడీతో చెప్పించాలని కోరారు.

మోడీ కోసం మీరు ఎదురు చూస్తుంటే, ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోందని పేర్కొన్నారు. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోందని తెలిపారు. తిరుపతి వేదికగా మీ సమక్షంలోనే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా అన్నారు. 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని మీరు అడిగారు. మాటలు కోటలు దాటాయి తప్పిస్తే.. చేతలకు దిక్కులేదు. రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా హామీని అందరు కలిసి ఆటకెక్కించారని మండిపడ్డారు.

వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన పాపాన పోలేదని, ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టలేదని ఆమె విమర్శించారు. పారిశ్రామిక కారిడార్లు స్థాపన లేదని , 10 ఏళ్లు దాటినా పోలవరం నుంచి చుక్క నీరు పారలేదని, కడప స్టీల్ కట్టలేదని ఆరోపించారు. విశాఖ ఉక్కును రక్షించలేదని, ఏటా 2 కోట్ల ఉద్యోగాల్లో కనీసం లక్ష ఉద్యోగాలు కూడా రాష్ట్రానికి ఇచ్చింది లేదని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

In a briefing on thursday, an israeli military spokesman, lt. Advantages of overseas domestic helper. Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda.