Headlines
ktr comments on cm revanth reddy

హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్

హైదరాబాద్‌: ఫార్మూలా ఈ కారు రేసు కేసులో విచారణకు హాజరయ్యే సమయంలో న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు స్వీకరించింది. ఫార్మూలా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈ నెల 9న విచారణకు రావాలని కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది.

image
image

ఈ నెల 6 విచారణకు న్యాయవాదిని అనుమతించని కారణంగా తన ఏసీబీ ఇచ్చిన నోటీసుకు ఆయన సమాధానం ఇచ్చి వెళ్లిపోయారు. అయితే ఈ నెల 9న విచారణకు హాజరయ్యే సమయంలో కూడా అడ్వకేట్ కు ఏసీబీ అనుమతించలేదు. దీంతో ఏసీబీ విచారణకు హాజరయ్యే సమయంలో తన న్యాయవాదిని అనుమతించాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.

కాగా, ఫార్ములా ఈ-కార్‌ రేస్‌పై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టాలని కోరితే ముఖ్యమంత్రి ఎందుకు పారిపోయారని, రేవంత్‌రెడ్డికి దమ్ముంటే.. ఆయ న జూబ్లీహిల్స్‌ ప్యాలెస్‌లో మీడియా సమక్షంలో చర్చ పెడితే తాను రెడీ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌ చేశారు. ఆ తర్వాత ఏసీబీ విచారణకైనా, ఈడీ విచారణకైనా సిద్ధమేని స్పష్టంచేశారు. రాజ్యాంగం, న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉన్నదని, తనపై మోపిన అక్రమ కేసులపై న్యాయస్థానాల్లోనే కొట్లాడుతామని తేల్చిచెప్పారు.

ఈ కేసులు ఆరంభం మాత్రమేనని, నాలుగేండ్లలో ఇంకా ఎన్ని కేసులు పెట్టినా ఎదురొంటామని, దేశానికి రక్షణ కవచంలా న్యాయ వ్యవస్థ ఉన్నదని పేర్కొన్నారు. ‘నిజాయితీకి ధైర్యం ఎకువ.. రోషంగల్ల తెలంగాణ బిడ్డగా ఏ విచారణనైనా ఎదురొనేందుకు సిద్ధం’ అని చెప్పారు. లాయర్లతో విచారణకు బుధవారం హైకోర్టు అనుమతిస్తే 9న ఏసీబీ విచారణకు లాయర్లతో వెళ్తానని తెలిపారు. 16న ఈడీ విచారణకు కూడా హాజరవుతానని, వారు ఏమడిగినా సమాధానం చెప్తానని, దాపరికం లేదు.. దాయాల్సిందేమీ లేదని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Contact us today to learn more about lexington country club homes for sale fort myers florida. While waiting, we invite you to play with font awesome icons on the main domain. Advantages of overseas domestic helper.