విజయ్ హజారే ట్రోఫీ ఉత్కంఠకరంగా సాగుతోంది.బ్యాట్స్‌మెన్స్ పరుగుల కోసం జట్టు పడుతుండగా, ఇంగ్లండ్ సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది.గౌతమ్ గంభీర్ ఎవరిని జట్టులోకి తీసుకుంటారన్నది అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా, ఫిబ్రవరి 19న పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై కూడా అందరి దృష్టి ఉంది. ఈ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఐదుగురు బ్యాట్స్‌మెన్స్‌పై కసరత్తు జరుగుతోంది.మరి వీరిలో ఎవరికైనా టీమిండియాలో చోటు దక్కుతుందా? ఈ సీజన్‌లో విజయ్ హజారే ట్రోఫీని ప్రభావితం చేసిన బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్.
7 మ్యాచ్‌ల్లో 7 ఇన్నింగ్స్ ఆడిన అతను 4 సెంచరీలతో 613 పరుగులు సాధించాడు.సగటు 153.25 ఉండటంతో అతని ఫామ్ రెడ్ హాట్‌గా కొనసాగుతోంది.మయాంక్ తర్వాత రెండో స్థానంలో కరుణ్ నాయర్ నిలిచాడు.6 మ్యాచ్‌ల్లో 5 ఇన్నింగ్స్ ఆడిన కరుణ్ 542 పరుగులు చేశాడు.అతని బ్యాటింగ్ సగటు 108.4గా ఉండగా, 4 సెంచరీలతో తన స్థాయిని చాటాడు.సిద్ధేష్ వీర్ ఈ సీజన్‌లో మూడవ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు. 7 మ్యాచ్‌ల్లో 490 పరుగులతో తన సత్తా చాటాడు.
సగటు 122.50 ఉండగా, 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు సాధించాడు.పంజాబ్ ప్లేయర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 7 మ్యాచ్‌ల్లో 484 పరుగులు చేయగా, సగటు 96.80. అతని 3 సెంచరీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 17 ఏళ్ల ఆయుష్ మ్హత్రే 458 పరుగులు చేయడం విశేషం. 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీతో అతను భవిష్యత్ స్టార్‌గా నిలిచాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ టాప్ 5 బ్యాట్స్‌మెన్స్‌లో ఎవరికైనా ఇంగ్లండ్ సిరీస్ లేదా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియాలో చోటు దక్కుతుందా? గతంలో టీమిండియాలో ఆడిన అనుభవం ఉన్నా, చాలామంది ఇప్పుడు జట్టుకు దూరంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గంభీర్ ఎవరిని ఎంపిక చేస్తాడన్నదే కీలకం.