హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ కావటం ఖాయమని అధికార కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ కేసులో A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి ఏసీబీ, ఈడీ విచారణకు హాజరయ్యారు.
హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని ఏసీబీ కార్యాలయంలో అరవింద్ కుమార్ విచారణకు హాజరయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన MA & UD శాఖలో స్పెషల్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ ఫార్ములా ఈ-రేసు అగ్రిమెంట్ సమయంలో అరవింద్ కుమార్ అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే రూ.55 కోట్ల అక్రమ నగదు లావాదేవీలపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ రికార్డ్ చేసేందుకు విచారణకు పిలిచారు.
ఇదే కేసులో మనీ లాండరింగ్, ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి ఈడీ అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ-రేసు 2 అగ్రిమెంట్ సమయంలో డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయటంతో బీఎల్‌ఎన్ రెడ్డి కీ రోల్ ప్లే చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. విదేశాలకు నిధులు ట్రాన్స్‌ఫర్ చేసే ముందు ఆర్‌బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదనే అంశాలపై ఈడీ బీఎల్‌ఎన్ రెడ్డి ప్రశ్నించనున్నట్లు సమాచారం.