Headlines
Warm welcome to Prime Minister.. Pawan Kalyan

ప్రధానికి హృదయపూర్వక స్వాగతం: పవన్ కళ్యాణ్

అమరావతి: నేడు ఏపీలోని విశాఖలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్‌కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులను సైతం ప్రారంభించనున్నారు. ఆ తర్వాత భారీ బహిరంగలో ప్రధాని మోడీ హాజరై ఏపీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

image
image

ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోడీ చొరవతో ఏపీ అభివృద్ధివైపు పరుగులు పెడుతోందన్నారు. ‘ప్రధానికి హృదయపూర్వక స్వాగతం. ఏపీ ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఈరోజు విశాఖ కేంద్రంగా “దక్షిణ కోస్తా రైల్వే జోన్” కేంద్ర కార్యాలయం ప్రారంభం కానుందని తెలిపారు. అలాగే పూడిమడకలో రూ.1,85,000 కోట్ల పెట్టుబడితో NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లి ప్రాంతంలో రూ.1,877 కోట్ల పెట్టుబడితో బల్క్ డ్రగ్ పార్క్ లకు శంకుస్థాపన చేస్తానని’ వెల్లడించారు.

కాగా, ప్రధాని మోడీ నేడు ఏపీలో అడుగుపెట్టనున్నారు. విశాఖలో పర్యటించనున్నారు. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తరువాత తొలిసారి రాష్ట్రానికి విచ్చేస్తున్నారు మోడీ. దాదాపు రెండు లక్షల కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు చేయనున్నారు. విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వే జోన్ కు సైతం శ్రీకారం చుట్టనున్నారు. వివిధ రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను సైతం జాతికి అంకితం చేయనున్నారు. మోదీ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పక్కాగా ఏర్పాట్లు చేసింది. మోడీ పర్యటనకు సంబంధించి ఇన్చార్జిగా మంత్రి నారా లోకేష్ వ్యవహరించారు. మూడు రోజుల కిందట ఆయన విశాఖలో అడుగుపెట్టారు. ఏర్పాట్లను సమీక్షించారు. మోదీ రోడ్ షో తో పాటు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆయనతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం పాల్గొంటారు. పలువురు కేంద్ర మంత్రులు సైతం హాజరవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Estero florida bundled golf communities. Were. Advantages of overseas domestic helper.