భారతదేశ చరిత్రలో హైదరాబాదు సంస్థానం విలీనం, రజాకార్ల పాలన వంటి కీలక సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం రజాకార్. ఈ సినిమాకు యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించగా, అనసూయ, ఇంద్రజ, బాబీ సింహా వంటి ప్రముఖులు ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 15, 2023న విడుదలైన ఈ చిత్రం వివాదాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన పొందింది. రజాకార్ చిత్రం తెలంగాణ చరిత్రలో కీలక ఘట్టాలుగా నిలిచిన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో అనసూయ, ఇంద్రజ, బాబీ సింహా, వేదిక, ప్రేమ, మకరంద్ దేశ్‌పాండే, రాజ్ అర్జున్, తేజ్ సప్రు, జాన్ విజయ్, దేవీ ప్రసాద్ వంటి ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. సినిమా రిలీజ్‌కు ముందు నుంచే వివాదాలకు దారితీసింది.రజాకార్ సినిమాకు సంబంధించి రాజకీయ పార్టీల మధ్య భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
![razakar](https://vaartha.com/wp-content/uploads/2025/01/razakar.jpg)
కొన్ని పార్టీలు ఈ సినిమాను ప్రోత్సహిస్తే, మరికొన్ని పార్టీలు ఈ చిత్రంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి.మార్చి 15న విడుదలైన రజాకార్ సినిమా ఒక వర్గం ప్రజలకు అనుకూలంగా కనిపించగా, మరికొందరు విమర్శించారు. మొత్తానికి, థియేటర్లలో సినిమా యావరేజ్ వసూళ్లతో సరిపెట్టుకుంది.థియేటర్లలో విడుదలైన దాదాపు పది నెలల తర్వాత, రజాకార్ సినిమా ఓటీటీలోకి ప్రవేశించబోతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఆహా ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. జనవరి 24 నుంచి రజాకార్ సినిమాను ఆహా ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆహా తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించింది. అలాగే రజాకార్ మూవీ పోస్టర్‌ను షేర్ చేస్తూ ప్రేక్షకులను సినిమాను చూసేందుకు ఆహ్వానించింది. రజాకార్ సినిమాను థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఆహాలో ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశాన్ని పొందనున్నారు. తెలంగాణ చరిత్రను ఆవిష్కరించే ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి.