Headlines
ఆస్పత్రిలో చేరిన విశాల్ డాక్టర్లు ఏమంటున్నారంటే?

ఆస్పత్రిలో చేరిన విశాల్ డాక్టర్లు ఏమంటున్నారంటే?

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఇటీవల జరిగిన మదగజరాజ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ‌లో విశాల్ చాలా బలహీనంగా కనిపించారు. బాగా బక్కచిక్కిపోయి,వేదికపై వణుకుతూ మాట్లాడిన దృశ్యాలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. ఇదంతా చూసిన అభిమానులు అతని ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు.యాక్షన్ సినిమాలతో విశాల్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించారు. తమిళనాడులోనే కాదు, తెలుగురాష్ట్రాల్లోనూ విశాల్‌కు భారీగా అభిమానులు ఉన్నారు.

vishal
vishal

అయితే, ఈవెంట్‌లో ఆయన మారిన రూపాన్ని చూసిన ప్రేక్షకులు,అభిమానులు గమనించారు.అందరి కన్నా ఎక్కువగా అనారోగ్యంగా ఉన్నట్లు కనిపించిన విశాల్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. మదగజరాజ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ అనంతరం విశాల్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం,”విశాల్ ప్రస్తుతం వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. చికిత్స అందిస్తున్నాం. పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది,” అని తెలిపారు.ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిన తర్వాత విశాల్ వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, ప్రేక్షకులు “విశాల్ త్వరగా కోలుకోవాలి” అంటూ సోషల్ మీడియా ద్వారా తమ ప్రార్థనలు తెలియజేస్తున్నారు.

విశాల్ ఆరోగ్య సమస్యల మధ్య ‘మదగజరాజ’ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది.12 ఏళ్ల క్రితం చిత్రీకరణ పూర్తి చేసిన ఈ సినిమా చివరికి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్‌లుగా నటించారు. సంతానం, సోనూసూద్ ముఖ్య పాత్రల్లో మెరవనున్నారు.ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి హాజరైన విశాల్‌కి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.సినిమాపై అతనికి ఉన్న ప్రేమ, కష్టసాధ్యమైన పరిస్థితుల్లోనూ ప్రామాణికత చూపించిన విధానం అభిమానుల మనసులను గెలుచుకుంది. విశాల్ త్వరగా కోలుకుని, మరోసారి ఫుల్ ఎనర్జీతో స్క్రీన్‌పై కనిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు.’మదగజరాజ’ సినిమాపై భారీ ఆశలుండటంతో, అభిమానులు సినిమా విజయం కోసం కూడా ప్రార్థిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Contact us today to learn more about homes for sale in copperleaf at the brooks in estero florida. While waiting, we invite you to play with font awesome icons on the main domain. Advantages of overseas domestic helper.