Headlines
chief election commissioner

ఈవీఎం అవకతవకలకు తావులేదు: ఈసీ

ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎం అవకతవకలకు జరిగినట్లుగా వస్తున్న వార్తలు, రిగ్గింగ్ వంటి వాటిపై రాజకీయ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తోసిపుచ్చారు. ఈవీఎంలలో వైరస్, బగ్‌ కానీ, చెల్లని ఓట్లు కానీ ఉండవని, రిగ్గింగ్‌కు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇండియాలో 99 కోట్ల రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారని, ఓటింగ్, మహిళా పార్టిసిపేషన్‌లో ఎన్నికల సంఘం కొత్త రికార్డులు సృష్టించిందని, త్వరలో 100 కోట్ల రిజిస్టర్డ్ ఓటర్లతో సరికొత్త రికార్డు నమోదు కానుందని చెప్పారు. మహిళా ఓటర్ల సంఖ్య 48 కోట్లు దాటడం దేశంలో మహిళా సాధికారతను బలంగా చాటుతోందన్నారు. ఈవీఎంల గురించి సమాధానం ఇచ్చిన తర్వాత కూడా కొందరు ఈవీఎంల అవకతవకలపై మాట్లాడుతున్నారని అన్నారు.

ఎన్నికల జాబితాలో అవకతవకలపై ఇప్పటికీ కథనాలు వస్తున్నాయని, ఈ విషయంలో 70 స్టెప్స్ ఉంటాయని, ఎన్నికల జాబితా, ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంలు, పోలింగ్ స్టేషన్లు, ఫార్స్ 17 (సీ), కౌంటింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు. పార్టీలు, అభ్యర్థులు అక్కడ తమతో ఉంటారని చెప్పారు. ”ఎన్నికల జాబితాలు రూపొందించేటప్పుడు రెగ్యులర్ సమావేశాలు ఉంటాయి. ఫామ్-6 లేకుండా సాధ్యం కాదు. ప్రతి దశలోనూ బీఎల్ఏను నియమించుకునే హక్కు ఉంటుంది. అభ్యంతరాలు తలెత్తితే ప్రతి పార్టీతో షేర్ చేసుకుని దానిని వెబ్‌సైట్‌లో ఉంచుతాం. ఫామ్7 సమర్పించేంత వరకూ పేర్లు తెలగించడం సాధ్యేం కాదు” అని రాజీవ్ కుమార్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Moldova to destroy explosives found in drone near ukraine border – mjm news. Advantages of overseas domestic helper. Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda.