Headlines
earthquake

పెరుగుతున్న భూకంపం మృతుల సంఖ్య

టిబెట్‌ను భారీ భూకంపం వణికిస్తోంది. ఇవాళ ఉదయం కేవలం గంట వ్యవధిలోనే టిబెట్‌ ప్రాంతంలో ఆరుసార్లు భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్‌ నివేదిక ప్రకారం.. పెను భూకంపం ధాటికి ఇప్పటి వరకూ 95 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 130 మంది గాయపడ్డారు.

టిబెట్‌ను భారీ భూకంపం వణికించిన విషయం తెలిసిందే. నేపాల్‌ – టిబెట్ సరిహద్దుల్లో ఇవాళ ఉదయం 6:30 గంటల సమయంలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఆ తర్వాత స్వల్ప తీవ్రతతో పలుమార్లు భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. తాజాగా ఈ భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య వందకు చేరువైంది.

నేపాల్‌ – టిబెట్‌ సరిహద్దుల్లో మంగళవారం ఉదయం 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. చైనాకు చెందిన మానిట‌రింగ్ ఏజెన్సీ మాత్రం భూకంప తీవ్రత‌ను 6.8గా పేర్కొన్నది. టిబెల్ రాజ‌ధాని లాసాకు సుమారు 380 కిలోమీట‌ర్ల దూరంలో భూమి కంపించిన‌ట్లు తెలుస్తోంది.
భూకంప తీవ్రత ఉత్తర భారతాన్ని కూడా తాకింది. ఢిల్లీ ఎన్సీఆర్‌, బెంగాల్‌, బీహార్‌, అస్సాం, పశ్చిమబెంగాల్‌తోపాటు పలు ప్రాంతాల్లోనూ ప్రకంపణలు సంభవించాయి. బీహార్‌లో ఆందోళనకు గురైన ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. ఇక చైనా, భూటాన్‌, బంగ్లాదేశ్‌లోనూ భూమి కంపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The fox news sports huddle newsletter. Basic implements by domestic helper | 健樂護理有限公司 kl home care ltd. Gelar rapat paripurna, ini 10 rancangan randerda inisiatif dprd kota batam.