Headlines
andhra high court

నటి జెత్వాని కేసులో నిందితులకు బెయిల్

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ముంబై నటి జెత్వాని కేసులో నిందితులకు హైకోర్టులో బెయిల్ లభించింది. వైస్ జగన్ ప్రభుత్వంలో జరిగిన ఈ కేసు చంద్రబాబు ప్రభుత్వం తిరిగి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసినదే. నిందితులకు షరతులతో కూడిన బెయిల్ రావడంతో అడ్వకేట్ నర్రా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. నటి జెత్వానిని వేధింపుల కేసులో నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, ఐదుగురు నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందన్నారు. విచారణలో జెత్వానిని వారు తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, ఈ వ్యవహారంలో నలుగురు పోలీసు అధికారులు ఉన్నారని పేర్కొన్నారు.

కేసు నమోదు కంటే ముందే ఐపీఎస్ అధికారులు ముంబై వెళ్లారని, ఇలాంటి కేసులో బెయిల్ ఎలా వచ్చిందో అర్థం కావటం లేదన్నారు. ఖచ్చితంగా ఈ బెయిల్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు. జెత్వానిపై పెట్టిన కేసును కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు.


కాగా సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఐపీఎస్‌ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్‌ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణ, న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లు కొట్టివేయాలని హైకోర్టును సీఐడీ కోరింది. ‘కేసులో ఏ2గా ఉన్న అప్పటి నిఘా విభాగాధిపతి పీఎస్ఆర్‌ ఆంజనేయులు సూచనల మేరకు వీరంతా ప్రణాళిక ప్రకారం జెత్వానీని కట్రపూరితంగా కేసులో ఇరికించినట్లు దర్యాప్తులో తేలింది.

జెత్వానీని అరెస్ట్‌ చేయాలని ఐపీఎస్‌ అధికారులు కాంతిరాణా, విశాల్‌గున్నీలకుపీఎస్ఆర్‌ ఆంజనేయులు సూచించారు. కేసు నమోదు చేయడానికి ఒకరోజు ముందే ముంబైకి వెళ్లేందుకు వీలుగా కాంతిరాణా దిగువస్థాయి పోలీసులకు విమాన టికెట్లు బుక్‌ చేశారు. పర్యవసానాలు ఆలోచించకుండా పైఅధికారి చెప్పినట్లు ఐపీఎస్‌ అధికారులు నడుచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Military installs temporary pier in gaza for aid. Advantages of local domestic helper. Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda.