Headlines
sankranthi school holidays

జనవరి 10 నుండే స్కూళ్లకు సంక్రాంతి సెలవులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సంబంధించిన పాఠశాలల సెలవులపై స్పష్టతనిచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 10నుంచి సెలవులు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్‌లో ఎటువంటి మార్పు లేదని అధికారులు తెలిపారు. ఈ సెలవులు జనవరి 19 వరకు కొనసాగుతాయని, 20నుంచి పాఠశాలలు మళ్లీ ప్రారంభమవుతాయని ప్రకటించారు.

ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ స్కూళ్లకు కూడా ఈ సమయానికి సమానమైన సెలవులు ఉంటాయని స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇళ్లకు వెళ్లే అవకాశం ఉండటంతో ఈ సెలవులను ముందుగానే షెడ్యూల్ చేశారు. ఇది కుటుంబాలతో కలిసి పండుగను ఆనందంగా గడిపేందుకు సరైన సమయమని భావిస్తున్నారు.

అయితే, క్రిస్టియన్ పాఠశాలలకు మాత్రం ప్రత్యేకంగా 11నుంచి 15వరకు హాలిడేస్ ఉంటాయని అధికారులు వెల్లడించారు. క్రిస్మస్, నూతన సంవత్సరం సెలవుల తర్వాత వచ్చే ఈ సంక్రాంతి సెలవులకు కూడా అవగాహన కల్పించారని తెలిపారు. ఈ సమయంలో పాఠశాలల నిర్వహణలో ఎటువంటి గందరగోళం ఉండదని ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు రూపొందించింది. సెలవుల సమయంలో విద్యార్థులు తమ సిలబస్‌ను పరిశీలించి, మిగిలిన బోధనపై దృష్టిపెట్టాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. సంక్రాంతి పండుగ ఆచారాలను పాటిస్తూ ఆనందంగా గడపడం తప్పనిసరి అయినప్పటికీ, రాబోయే పరీక్షల కోసం సన్నద్ధమవ్వడం కూడా అవసరమని వారు గుర్తు చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు సంబంధించిన ఈ సెలవుల షెడ్యూల్‌పై తల్లిదండ్రులు, విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ వల్ల ఏవైనా అనుమానాలు నివృత్తి అయ్యాయని, ఈ పండుగను కుటుంబంతో కలిసి ఆనందంగా గడపగలమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *