Headlines
ప్రేమ మిమ్మల్ని కట్టిపడేస్తుంది.. అంజలి కామెంట్స్

ప్రేమ మిమ్మల్ని కట్టిపడేస్తుంది.. అంజలి కామెంట్స్

దర్శకుడు శంకర్‌ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన గేమ్ చేంజర్ ట్రైలర్‌ లాంచ్‌తో ప్రేక్షకుల్లో ఉన్న అనుమానాలకు ముగింపు ఇచ్చారు.హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో విడుదలైన ట్రైలర్ మెగా ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.రామ్ చరణ్‌ హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.రామ్ చరణ్‌ ప్రధాన పాత్రలో,శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్‌, దిల్ రాజు ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం తెలుగు,తమిళ,హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది.చిత్రంలో ప్రధాన పాత్రల్లో ఒకటిగా కనిపించిన అంజలి, తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.నా పాత్ర పేరు పార్వతి. శంకర్‌ గారు ఈ పేరు చెప్పినప్పుడు నా అమ్మ గుర్తుకొచ్చింది.

anjali
anjali

ఈ పాత్ర నా కెరీర్‌లో అత్యుత్తమమైనదిగా నిలుస్తుందని భావిస్తున్నాను, అని అంజలి చెప్పుకొచ్చారు. పార్వతి పాత్రకు ప్రత్యేకంగా ప్రిపరేషన్‌ అవసరం లేకపోయినా, దానికి కావాల్సిన భావోద్వేగాలు, నాటకీయతకు తగినట్లు నటించానని ఆమె అన్నారు. “ఈ పాత్ర నా దగ్గర నుంచి చాలా డిమాండ్‌ చేసింది. ఇది నాకు కొత్త అనుభవం. ప్రేక్షకులు ఈ పాత్రను తెరపై చూసినప్పుడు థ్రిల్‌ ఫీల్‌ అవుతారు, అని అంజలి తెలియజేశారు. అంజలి నటనను ప్రశంసించిన శంకర్‌, ఈ పాత్రలోని ఆత్మను అద్భుతంగా పండించారన్నారు. శంకర్‌ గారు నా నటనను చాలాచోట్ల మెచ్చుకున్నారు. ఇది నా కెరీర్‌లో ది బెస్ట్‌ పాత్ర అని నమ్ముతున్నాను. నా పాత్రకు సంబంధించిన ప్రతి సీన్‌ ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకోవాలి,” అని అంజలి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో అంజలి పాత్రకు ప్రత్యేకమైన బ్యాక్‌డ్రాప్ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uconn uses improbable second half run to clinch trip to final four, continue march madness dominance. For details, please refer to the insurance policy. Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda.