Headlines
mohan babu

మోహన్ బాబు పిటిషన్ విచారణ వాయిదా

హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. తన వయసు 78 ఏళ్లని, గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నానని, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ లో సుప్రీకోర్టును కోరారు. ఈ పిటిషన్ ను జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల బెంచ్ విచారించింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అందుబాటులో లేకపోవడంతో మోహన్ బాబు తరపు న్యాయవాది పాస్ ఓవర్ కోరారు. దీనికి అంగీకరించిన సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. వచ్చే గురువారం విచారణ చేస్తామని వెల్లడించింది.

suprem court


జర్నలిస్ట్ పై దాడి చేసిన ఘటనలో సినీ నటుడు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు అంగీకరించలేదు. దీంతో, ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *