ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై వైసీపీ మండిపడింది. ఈ మేరకు టీడీపీ చెప్పిన అబద్ధాలకు సంబంధించి పలు ప్రశ్నలను ట్విట్టర్ ( ఎక్స్) వేదికగా నిలదీసింది. అధికారంలోకి రాగానే తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది స్కూల్‌కు వెళ్లే పిల్లలుంటే అంత మందికి ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున ఇస్తామని చెప్పింది మీరు కాదా? ఇచ్చారా? గత ప్రభుత్వ పాలకులు ఉత్తరాంధ్రకు ఏం పీకారని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడింది. మాటలు జాగ్రత్తగా మాట్లాడు.. గతం ఒకసారి గుర్తుకు తెచ్చుకో అని సూచించింది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీ బాబు ఏం పీకాడు అని ప్రశ్నించింది. ఉద్యోగుల సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పింది మీరు కాదా? సమీక్షించారా?
– ఉద్యోగులకు ఐఆర్, డీఏ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది మీరు కాదా? చేశారా?
– మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పింది మీరు కాదా? కల్పించారా?
ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పింది మీరు కాదా? కల్పించారా?
నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది మీరు కాదా? ఇచ్చారా?
ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పింది మీరు కాదా? ప్రకటించారా?
అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది మీరు కాదా? చేశారా?
అధికారంలోకి రాగానే వాలంటీర్లకు వేతనం రూ.5వేల నుంచి రూ.10 వేలు పెంచుతామని చెప్పింది మీరు కాదా? పెంచారా?అధికారంలోకి రాగానే మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పింది మీరు కాదా? ఇచ్చారా?
రైతులకు ఏటా రూ.20వేలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పింది మీరు కాదా? చేశారా?
19 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలందరికీ ఏటా రూ.18 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పింది మీరు కాదా? సహాయం చేశారా?
ఇప్పుడు చెప్పు లోకేష్ ఎవరిది ఫేక్ పార్టీ అని వైసీపీ నిలదీసింది. గత ప్రభుత్వ పాలకులు ఉత్తరాంధ్రకు ఏం పీకారని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడింది. మాటలు జాగ్రత్తగా మాట్లాడు.. గతం ఒకసారి గుర్తుకు తెచ్చుకో అని సూచించింది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీ బాబు ఏం పీకాడు అని ప్రశ్నించింది. నీకు గుర్తు ఉందో లేదా.. విశాఖకు రైల్వే జోన్ వద్దు, విజయవాడకు ఇవ్వండి అంటూ నాటి ఎంపీలు రాయపాటి, గల్లా జయదేవ్ చేత కేంద్రానికి మీ బాబు లేఖలు రాయించింది మరిచిపోయావా? అని ప్రశ్నించింది. 14 ఏళ్లు సీఎంగా ఉండి నువ్వు ఏం పీకావని ఇంటికి వెళ్లి మీ బాబును అడుగు అని మండిపడింది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైఎస్ జగన్ ఎంత చేశారో చూడమని పలు ఉదాహరణలు చెప్పింది.