వెంకట్రాc ముఖ్యంగా పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం ఉద్యోగులను టార్గెట్ చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇదే పరిస్ధితి కొనసాగితే ఉద్యోగులు ఏం చేయాలో కూడా ఆయన చెప్పేశారు.
గత వైసీపీ ప్రభుత్వంలో వెంకట్రామిరెడ్డి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉండే వారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఓటేయాలని ఆయన ఊరూరా తిరిగి ప్రచారం చేయడంతో ఈసీ ఆదేశాలతో ఆయనపై వేటు పడింది. అప్పట్లో ఆయన్ను సస్పెండ్ చేశారు. ఇప్పటికీ అది కొనసాగుతోంది. అలాగే సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా కూడా ఆయన్ను తొలగించి కొత్తగా ఎన్నికలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రామిరెడ్డి ఉద్యోగుల వేధింపులపై గళం విప్పారు.
భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారు
ఉద్యోగులను ఎవరైనా ఇబ్బంది పెడితే వారి పేర్లు రాసి పెట్టుకోవాలని వారికి సూచించారు. అలాంటి వారు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారని వెంకట్రామిరెడ్డి రెడ్ బుక్ తరహాలోనే హెచ్చరికలు చేశారు. సమీక్షా సమావేశాల్లో కింది స్దాయి అధికారుల్ని పైస్థాయి అధికారులు వేధిస్తున్నారని, టీడీపీ కార్యకర్తలొస్తే గౌరవంగా టీ ఇచ్చి మాట్లాడి పంపాలని, లేకపోతే మీ సంగతి చూస్తామని మంత్రులు హెచ్చరికలు చేస్తున్నారని వెంకట్రామిరెడ్డి ఆరోపించారు.
అలాగే సచివాలయ ఉద్యోగులు తెల్లవారు జామునే వెళ్లి తలుపులు కొట్టి పెన్షన్లు ఇమ్మంటున్నారని, ఉదయం 8 గంటల కల్లా ఇస్తే ప్రపంచం ఏమైనా తలకిందులవుతుందా అని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు. ఇప్పటికైనా ఐఆర్ ఇవ్వాలని, పెండింగ్ డీఏల్లో ఒక్కటైనా ఇవ్వాలని వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.