ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. తాజాగా నారా లోకేశ్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయంగా ప్రారంభించిన ఆయన, కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తాను తీసుకున్న తొలి నిర్ణయం… ‘విద్యాశాఖలో రాజకీయ జోక్యం ఉండకూడదు’ అని వెల్లడించారు.
తమ ఫొటోలు పార్టీ రంగులు వుండవు
విద్యాశాఖకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ తమ ఫొటోలు ఉండవని, తమ పార్టీ రంగులు ఉండవని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఇచ్చే మెటీరియల్ లోనూ తమ పేర్లు ఉండవని తెలిపారు. సమాజం కోసం ఎవరిని స్ఫూర్తిగా తీసుకుని మనం మంచి పనులు చేయాలనుకుంటామో, వారి పేర్లు పెట్టామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. “డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో స్కూల్ కిట్లు అందజేశాం. ఇవాళ డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం తీసుకువచ్చాం. అంతేకాదు, స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో కేవలం జాబ్ మేళాలు మినహా మరే ఇతర కార్యక్రమాలు జరిపేందుకు వీల్లేదని అని అన్నారు