Headlines
ys jagan

ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు: జగన్

ఏపీ ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు.
చంద్రబాబును విమర్శిస్తూ ఎక్స్ లో జగన్ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు గడుస్తున్నా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ అధినేత సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పలు హామీలు, వాటిని పెంచి ఇస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేయకుండా ఆలస్యం చేస్తున్న తీరును టార్గెట్ చేస్తూ ఎక్స్ లో జగన్ సుదీర్ఘ పోస్టు పెట్టారు.

తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదని జగన్ ఆక్షేపించారు.

చంద్రబాబు గారూ.. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్‌ ఇట్‌ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షలమంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా? అంటూ జగన్ ట్వీట్ లో ఏకి పారేశారు. అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు, అధికారంలోకి రాగానే అంతకుముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారని గుర్తుచేశారు.
తుంగలో తొక్కిన వాగ్దానాలను
వరుసగా కేబినెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి కాని, తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చిచెప్పేశారన్నారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా? అని జగన్ ప్రశ్నించారు.

మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబుగారూ…? అన్నారు. మరోవైపు రైతు భరోసా తీరు కూడా అలానే ఉందని జగన్ ఆరోపించారు.
అలాగే ప్రతి పిల్లాడికి రూ.15వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే, అంతమందికీ అన్న తల్లికి వందనం అయినా మోసమే, రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20వేలు ఇస్తామన్నదీ మోసమే, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ రూ.18వేలు అయినా మోసమే, నిరుద్యోగభృతి కింద ప్రతి పిల్లాడికీ రూ.36వేలు అయినా మోసమే అని జగన్ విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fka twigs dances martha graham : ‘this is art in its truest form’. For details, please refer to the insurance policy. Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam.