Headlines
ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ 2025

ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ 2025

ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి (ఎస్ఎస్సీ) పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది. ఈ పరీక్షలు 2025 మార్చి 17 నుండి 31 వరకు నిర్వహించబడతాయి. విద్యార్థులు ఈ పరీక్ష షెడ్యూల్‌ను తనిఖీ చేయవచ్చు. పరీక్షల షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.

  • మార్చి 17th 2025 (సోమవారం) మొదటి భాష
  • మార్చి 19th 2025 (బుధవారం) రెండవ భాష
  • మార్చి 21th 2025 (శుక్రవారం)
  • మార్చి 24th 2025 (సోమవారం) గణితం
  • మార్చి 26th 2025 (బుధవారం) ఫిజిక్స్
  • మార్చి 28th 2025 (శుక్రవారం) జీవశాస్త్రం
  • మార్చి 31th 2025 (సోమవారం) సామాజిక అధ్యయనాలు
  • మార్చి 22th 2025: మొదటి భాషా పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1
  • మార్చి 29th 2025: OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) వొకేషనల్ కోర్సు (Theory)

విద్యార్థులు ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ 2025 జాగ్రత్తగా పరిశీలించి, పరీక్షలకు అవసరమైన సన్నాహక చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. పరీక్ష తేదీ షీట్ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క అధికారిక వెబ్సైట్లో ఉంది.

Also Read: తల్లికి వందనం అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు క్లారిటీ

మంత్రి నారా లోకేష్‌ శుభాకాంక్షలు:
2025 మార్చి 17 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా షెడ్యూల్ విడుదలైంది. విద్యార్థులు సన్నద్ధమవ్వడానికి మరియు ఒత్తిడిని తగ్గించుకోవడానికి, పరీక్షలు ప్రత్యామ్నాయ రోజుల్లో నిర్వహించబడ్డాయి. ఈ అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకుని, మెరుగైన మార్కుల కోసం కృషి చేయాలని సూచించారు. “నా సోదరులు, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు,” అని X వేదికగా ఆయన తెలిపారు.

మరోవైపు, ఏపీ ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుండి ప్రారంభమవనున్నాయి. ఈ ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం ఇంటర్ బోర్డు పంపించింది. ప్రభుత్వం ఆమోదించిన వెంటనే, కొద్దిసేపటి క్రితం షెడ్యూల్‌ విడుదల అయింది. మార్చి 1 నుండి 19 వరకు ఇంటర్ ఫస్టియర్‌ పరీక్షలు, మార్చి 3 నుండి 20 వరకు సెకండియర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇక, ఎథిక్స్‌ అండ్ హ్యుమన్ వాల్యూస్ పరీక్షను ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 10 నుండి ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. అలాగే, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌ పరీక్షను ఫిబ్రవరి 3వ తేదీన నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *