భారతదేశంలో వందేభారత్ రైలు ఓ చరిత్ర. పలు సౌకర్యాలతో పాటు నిర్ణిత సమయంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఇందులో భాగంగా త్వరలో ప్రముఖ పుణ్యక్షేత్ర వారణాసికి ఏపీ నుంచి డైరెక్టు రైలు ప్రారంభం కానుంది. అదే విధంగా ఏపీ నుంచి మరో రెండు వందేభారత్ రైళ్లు వస్తున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వెల్లడించారు. ఏపీకి రెండు వందేభారత్ రైళ్లు రావడం అవిశ్వరనీయమైన వార్త.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్తున్న వందేభారత్ కు అనూహ్య స్థాయి లో డిమాండ్ కనిపిస్తోంది. ఈ క్రమంలో కొత్తగా కోచ్ లను పెంచుతున్నారు. ఇప్పుడు రైల్వే మంత్రి కి అందిన ప్రతిపాదనలతో తెలుగు రాష్ట్రాలకు తొలి విడతలోనే వందేభారత్ స్లీపర్ దక్కనుంది.
ఏపీకి మరిన్ని కొత్త రైళ్లు
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కీలక ప్రకటన చేసారు. ఏపీకి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ త్వరలోనే మరిన్ని కొత్త రైళ్లు ఏపీ నుంచి ప్రారంభం అవుతాయని వెల్లడించారు. అందులో భాగం గా నరసాపురం-వారణాసి మధ్య కొత్త రైలు ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే రైల్వే మంత్రిని కోరినట్లు చెప్పుకొచ్చారు. గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వారణాసి వెళ్లే ప్రయాణీకుల కోసం ఈ రైలు ఏర్పాటు చేయాలని కోరినట్లు వివరించారు. ఈ రైలు అందుబాటు లోకి వస్తే తెలుగు రాష్ట్రాల నుంచి వారణాసి వెళ్లే ప్రయాణీకులకు మరింత సౌకర్యంగా ఉంటుంద ని మంత్రి పేర్కొన్నారు.