అమరావతి: అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్ర జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన పలు బస్సులు మంటల బారిన పడ్డాయి. అందులో ఒకటి పూర్తిగా దగ్ధమైంది. మరో మూడు పాక్షికంగా కాలిపోయాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులుస, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటల్లో దగ్ధమైన దివాకర్ ట్రావెల్స్ బస్సు మంటలను ఆర్పివేశారు. మంటలు మరిన్ని బస్సులకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు.
హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడటం, బస్సులో షార్ట్ సర్క్యుట్ వల్లే ఈ ఘటన సంభవించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తోన్నారు. ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా నిర్ధారించలేదు. బస్సు డాష్ బోర్డ్‌లో షార్ట్ సర్క్యుట్ జరిగి ఉండొచ్చనీ అనుమానిస్తోన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లి ఉండొచ్చని తెలుస్తోంది. ప్రమదానికి గల కారణాలు తెలియరాలేదన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయా లేదా ఎవరైనా నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సు (Diwakar Travels) దగ్ధమైంది. మరో బస్సు పాక్షికంగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.గురువారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
మొత్తం నాలుగు బస్సులు ఆర్టీసీ బస్‌స్టాండ్ సమీపంలో నిలిపి ఉన్నాయని, వాటిలో ఒకటి పూర్తిగా, మరొకటి పాక్షికంగా కాలిపోయాయని చెప్పారు. ప్రమదానికి గల కారణాలు తెలియరాలేదన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయా లేదా ఎవరైనా నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మరియు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన పలు బస్సులు మంటల్లో కాలిపోయిన సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనతో రాజకీయ మరియు ప్రజలలో ఆందోళన వ్యక్తమవుతోంది.