Headlines
AP Cabinet meeting today..!

నేడు ఏపీ కేబినెట్ భేటీ..!

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపనుంది. ఇందులో ముఖ్యమైన అంశాలపై చర్చ జరగబోతోంది. ముఖ్యంగా కొత్త సంవత్సరం సందర్భంగా ప్రారంభించాల్సిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గురించి మాట్లాడే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత, సీఎం చంద్రబాబు విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు. ఆపై, వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి జిందాల్ ప్రతినిధులతో సమావేశం కాబోతున్నారని సమాచారం.

నేటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశం ద్వారా, రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల వృద్ధిని పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్లీన్ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. 5 సంస్థలు, రూ. 83 వేల కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించనుండగా, ఈ ప్రాజెక్టులు 2.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలను అందిస్తాయి.

భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) నెల్లూరు జిల్లా రామయ్య పట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ఏర్పాటు చేయనుంది. దీని వలన 2,400 మందికి ఉపాధి అవకాశం కలుగనుంది. విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ. 80 కోట్ల పెట్టుబడితో 2 వేల మందికి ఉద్యోగాలు అందించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pope to bring his call for ethical artificial intelligence to g7 summit in june in southern italy. Advantages of overseas domestic helper. Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam.