Headlines
chandrababu

అమరావతి లో సినిమాలకు ఫుల్ డిమాండ్ – చంద్రబాబు

మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన చిట్‌చాట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సినీ రంగంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం భారతీయ చిత్ర పరిశ్రమకు ప్రధాన హబ్‌గా మారిందని, ఇది గత టీడీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల ఫలితమని చెప్పారు. తాము అప్పట్లో సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యల వల్లే ఈ స్థాయికి చేరుకున్నట్లు వివరించారు.

ఇక ఓవర్సీస్ మార్కెట్ గత కొంతకాలంగా పెద్దగా పెరిగిందని, తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశీ మార్కెట్లలోనూ తనదైన గుర్తింపు పొందుతున్నాయని చంద్రబాబు తెలిపారు. తెలుగు చిత్రరంగం తన సాంకేతిక నైపుణ్యాలతో ప్రపంచస్థాయిలో ప్రతిభ చూపుతోందని అభినందించారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ మరోసారి చిత్రపరిశ్రమకు ప్రధాన కేంద్రంగా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతిలో ఉన్న సదుపాయాలు, భవిష్యత్తులో పొందబోయే ప్రోత్సాహకాలు సినీ పరిశ్రమను ఆహ్వానించడానికి ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. సినిమాలకు సంబంధించిన ఆధునిక సదుపాయాలు, పెద్ద ఎత్తున స్టూడియోలు, వినూత్న ఆలోచనలు అమరావతిలో అమలు చేస్తామని చెప్పారు. ఇది తెలుగు చిత్రరంగం మరింత విస్తృతమవడానికి, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *