ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఆంధ్రాలో కూడా అమలు చేసేందుకు చంద్రబాబు నాయకత్వంలో సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి. ఉగాది నాటికీ ఈ పథకం అమలు చేయాలనీ కసరత్తు చేస్తున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలుకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ప్రజలు చెప్పిన అంశాలను ఆచరణలోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది.
అందులో భాగంగా పెన్షన్ పెంపు, ఉచిత గ్యాస్ అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఈ ఏడాది ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనుంది.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు భోజన పధకం
ఎన్నికల హామీ మేరకు ఏపీ నుంచి కొత్త సంవత్సరం వేళ కీలక హామీ అమలు మొదలు పెట్టింది. నేటి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని పున:ప్రారంభించనుంది.
ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తూ తాజా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014-19 టిడిపి హయాంలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించింది.
నేటి నుంచి అమలు ఇక, 2024 ఎన్నికల ప్రచారం వేళ తాము అధికారంలోకి వస్తే ఇంటర్ విద్యార్ధులకు మధ్నాహ్న భోజన పథకం అమలు చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు లక్ష మంది విద్యార్థులు చదువుతున్నారు. 2024-25 సంవత్సరానికి రూ.27.39 కోట్లు, 2025-26 ఏడాదికి రూ.85.84 కోట్ల ఖర్చే అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. మెనూ లో మార్పులు ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మధ్నాహ్న భోజన పథకం పేరు మార్పు చేసింది.