Headlines
wine shop

మందుప్రియులకు కొత్త సంవత్సరం కానుక

మందుప్రియులకు ఏపీ కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త ఎక్సైజ్ విధానం తీసుకువచ్చాక ప్రైవేటుకు మద్యం షాపులు అప్పగించినా ఎమ్మార్పీ రేట్ల కంటే ఎక్కువగా అమ్మకుండా కట్టడి చేయడం, పాత బ్రాండ్లన్నీ తిరిగి తీసుకురావడం, 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్ మద్యం వంటి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త సంవత్సరం సందర్భంగా మరో శుభవార్త చెప్పింది. కొత్త సంవత్సరం సందర్భంగా ఇవాళ, రేపు మద్యం షాపుల్ని అర్ధరాత్రి 12 గంటల వరకూ, బార్లను అర్ధరాత్రి ఒంటి గంట వరకూ తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు మద్యం షాపులు, బార్ల యజమానులకు అనుమతి ఇస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొత్త సంవత్సర వేడుకలు చేసుకునే వారు ఆయా సమయాల వరకూ అక్కడికి వెళ్లి మద్యం తెచ్చుకోవడం లేదా అక్కడే తాగేందుకు అనుమతి లభించనుంది.


కొత్త ఏడాది సందర్భంగా ఇవాళ, రేపు రాష్ట్రంలో మద్యం షాపుల్లో అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. పార్టీలు, వేడుకలు చేసుకునే వారితో పాటు వ్యక్తిగతంగా కూడా ఇంటికి మద్యం తెచ్చుకుని తాగే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో మద్యం షాపుల్ని, బార్లను కూడా అర్ధరాత్రి వరకూ తెరిచి ఉంచేలా ప్రభుత్వం ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

సర్కార్ కు భారీ ఆదాయం
ఇప్పటికే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి కొత్త ఎక్సైజ్ విధానం తెచ్చాక 75 రోజుల్లోనే ఏకంగా 6,312 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ 75 రోజుల్లో మొత్తం 26 లక్షల 78 వేల 547 బీర్లు అమ్ముడైనట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే 83 లక్షల 74 వేల 116 కేసుల మద్యం అమ్ముడైనట్లు వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *