Headlines
cr 20241230tn6772510f3f955

పవన్ కల్యాణ్ తో దిల్ రాజు భేటీ

సినిమారంగం, రాజకీయాలు ఇటీవల కాలంలో వేడిఎక్కిస్తున్న తరుణంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలవడంతో వీరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి చర్చించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. రామ్ చరణ్ కొత్త సినిమా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించాలని భావిస్తున్నట్లు దిల్ రాజు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని పవన్ కల్యాణ్ ను ఆహ్వానించినట్లు తెలిపారు. దీనికి పవన్ ఓకే చెప్పారని వివరించారు.

Pawan Kalyan Dil Raju m3

దిల్ రాజు, పవన్ ల భేటీపై గేమ్ ఛేంజర్ నిర్మాణ సంస్థ ట్విట్టర్ ద్వారా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపింది. కాగా, సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు, ప్రచార చిత్రాలు సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. విజయవాడలో ఏర్పాటు చేసిన రామ్ చరణ్ భారీ కటౌట్ రికార్డులకెక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *