ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మరో ఐఏఎస్ అధికారి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం రేపటితో ముగుస్తుండటంతో ప్రభుత్వం ఆయన స్థానంలో కొత్తగా విజయానంద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయానంద్ ప్రస్తుతం ఇంధనశాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రెండ్రోజుల్లో ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తారు.
ఆంధ్రప్రదేశ్ పరిపాలన విభాగంలో కీలక పదవి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మారబోతున్నారు. ప్రస్తుతం ఏపీ సీఎస్‌గా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం రేపటితో ముగియనుంది. అందుకే ప్రభుత్వం కొత్త సంవత్సరానికి ముందే ఆయన స్థానంలో కొత్త ఐఏఎస్ అధికారి విజయానంద్‌ని చీఫ్ సెక్రట్రీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.