రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయంపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలపై రూ.15,000 కోట్ల అదనపు భారం పడుతుందని ఆయన ఆరోపించారు. సామాన్య ప్రజలు ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఇలా చేయడం అన్యాయమన్నారు.
ఇప్పటికే ప్రభుత్వం గత 7 నెలల్లో రూ.74 వేల కోట్ల అప్పు చేసి, తాజాగా వరల్డ్ బ్యాంక్ నుంచి రూ.15 వేల కోట్ల నిధులు తెచ్చుకుని, మొత్తంగా రూ.లక్ష కోట్ల అప్పు చేసింది అని బొత్స ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రజల నడ్డి విరిచే నిర్ణయమని పేర్కొన్నారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందో అని బొత్స ప్రశ్నించారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెనక్కి తీసుకోవడం తక్షణ అవసరం అని డిమాండ్ చేశారు. ప్రజలు ఇలాంటి భారం తట్టుకోలేరని హెచ్చరించారు. ప్రజల ఆందోళనలను ప్రభుత్వం సకాలంలో పరిగణలోకి తీసుకుని, విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలు దీని మీద మరింత ఆందోళన వ్యక్తం చేస్తారని ఆయన స్పష్టం చేశారు.