నన్ను, నా కుమారుడిని అరెస్టు చేయడానికి ఓ మంత్రి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని పేర్నినాని ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గోదాం నుంచి బియ్యం మాయం కేసులో తనను, తన కుమారుడిని జనవరి 2వ తేదీలోగా పోలీసులు అరెస్టు చేయవచ్చని వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నా భార్యను అరెస్ట్ చేయడానికి ఓ మంత్రి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
![నన్ను, కుమారుడిని అరెస్టు చేయవచ్చు: పేర్ని నాని](https://vaartha.com/wp-content/uploads/2024/12/Perni-nani-1024x576.jpg)
తన భార్య పేరిట ఉన్న గోదాం నుంచి బియ్యం మాయం కేసులో తనను ఒక్కరోజైనా జైలులో పెట్టాలనే ఆలోచన జిల్లాకు చెందిన మంత్రి ఒకరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తన భార్యను కూడా జైలుకు పంపాలని సీఎం చంద్రబాబు దగ్గర ప్రస్తావించినప్పటికీ ఇంట్లోని ఆడవారి జోలికి వెళ్లవద్దని ఆదేశించడం అభినందనీయమని నాని పేర్కొన్నారు.
చంద్రబాబు చెప్పిన్నా వినడం లేదు
చంద్రబాబు చెప్పినప్పటికీ వారు ప్రయత్నాలు ఆపడం లేదని కొంత మంది ఎమ్మెల్యేలు, అధికారులు ఇందుకు సాక్ష్యమని పేర్కొన్నారు. నా భార్య జయసుధపై కేసు పెట్టిననాటి నుంచి నేటి వరకు తన కుటుంబాన్ని అరెస్టుకు మంత్రి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
2వ తేదీన తమ గోదాం మేనేజర్ క్వాష్ పిటిషన్ విచారణ ఉంది. ఆలోగా నన్ను, నా కుమారుడిని పోలీసులు అరెస్టు చేయవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తమ రాజకీయాలు, కక్ష సాధింపు కోసం ఇంట్లోని ఆడవాళ్ల జోలికి రావడం బాధాకరమని ఆయన అన్నారు.