Headlines
kalyan

ఎంపీడీవోను పరామర్శించిన పవన్‌ కల్యాణ్‌

వైసీపీ నాయకుల దాడిలో గాయపడి కడప రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఎంపీడీవో జవహర్‌బాబును డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ శనివారం పరామర్శించారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా గాలివీడులో జరిగిన ఈ సంఘటన తెలిసిందే. విజయవాడ నుంచి నేరుగా కడప జిల్లాకు వెళ్లి రిమ్స్‌లో ఉన్న ఎంపీడీవోను పరామర్శించి ధైర్యం చెప్పారు.
వైసీపీకి కొత్తమీ కాదు
ఇష్టారాజ్యంగా అధికారులపై దాడి చేస్తే ఉపేక్షించం. ఇంకా వైసీపీ రాజ్యం అనుకుంటున్నారా.. ఖబడ్దార్‌, తోలు తీసి కూర్చోపెడతామని వైసీపీ నాయకులను హెచ్చరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎంపీడీవోను అమానుషంగా కొట్టారని తెలిపారు. అధికారులపై దాడిచేయడం వైసీపీకి కొత్తమీ కాదని ఆరోపించారు. దాడులకు దిగి భయపెట్టాలని చూస్తే గత ప్రభుత్వం మాదిరి తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

ఘటనాస్థలికి సీఐ వెళ్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాలేదని, వైసీపీ నాయకులకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయని ఆరోపించారు. వైసీపీ దౌర్జన్యాలను ఎలానియంత్రిచాలో తెలుసు.. చేసి చూపిస్తామని అన్నారు. దాడి చేసిన వారిని ఎవరూ రక్షించలేరని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏంటో చేసి చూపిస్తామని పేర్కొన్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. ఘటనపై విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *