Headlines
Pawan Kalyan visit to Kadapa today

నేడు కడపలో పవన్ కళ్యాణ్ పర్యటన

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కడపకు పయనం అవుతున్నారు. ఇందులో భాగంగానే… గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ నేతల దాడిలో గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎంపీడీవో జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించునున్నారు.

వాతావరణం అనుకూలించకపోవడంతో గంట ఆలస్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభమైంది. కాగా, ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి కేసులో ట్విస్ట్‌ నెలకొంది. ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి కేసులో 26 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు అయిందని చెబుతున్నారు. గాలివీడు ఎంపిడివో జవహర్ బాబు పై దాడి ఘటనలో హత్యాయత్నం కేసు నమోదు అయింది. ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించారు అన్న అంశం తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దాడి ఘటనలో మొత్తం 26 మందిపై కేసు నమోదు అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *