Headlines
nimmala

జగన్ విద్యుత్ రంగాన్ని నాశనం చేసారు : నిమ్మల

జగన్ ఐదేళ్ల అరాచక పాలనతో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసి ప్రజలపై భారం మోపారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేస్తున్న ధర్నాపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందిస్తూ మాజీ సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంపుతో పాటు ట్రూ ఆఫ్ చార్జీలు అంటూ 16 వేల కోట్లు ప్రజలపై భారం మోపింది జగన్ అని అన్నారు.

అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
పాలకొల్లు నియోజకవర్గంలో మూడు గ్రామాల్లో రూ .3 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శుక్రవారం నాడు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ.. తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంపుతో పాటు ట్రూ ఆఫ్ చార్జీలు అంటూ 16 వేల కోట్లు ప్రజలపై భారం మోపింది జగన్ అని అన్నారు. జన్ కో నుంచి ఐదు రూపాయలకే యూనిట్ కరెంటు లభించే అవకాశం ఉండగా కమిషన్ల కోసం రూ. ఎనిమిది నుంచి 14 రూపాయలకు జగన్ కొనుగోలు చేశారని విమర్శించారు. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపిన జగన్ ఇంటి ముందే వైసీపీ శ్రేణులు ధర్నాలు చేయాలన్నారు. గత చంద్రబాబు పాలనలో విద్యుత్ చార్జీలను పెంచకపోవడమే కాకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *