ప్రస్తుతం కాకినాడ జిల్లాలో పెద్దపులి భయం కొనసాగుతుంది. పెద్ద పులి ఆ ప్రాంతంలో తిరుగుతున్న నేపథ్యంలో అక్కడ పర్యాటానికి సైతం దాదాపుగా 10 రోజులుగా బ్రేక్ పడింది. అతి సుందర వాతావరణం, వాటర్ ఫాల్ వంటివి అక్కడ ఉండడంతో అనేక మంది ప్రతి నిత్యం అక్కడికి వెళుతూ ఉంటారు. కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం.
పాదముద్రలు లభ్యం
నిజానికి అనుకున్న ప్రాంతంలో ఆ పెద్దపులి ఉందా లేదా అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది. గత పది రోజులు కిందట ఆ ప్రాంతంలో మేకల మందపై పెద్దపులి దాడి, సమీప పంట పొలాల్లో వాటి పాదముద్రలు గుర్తించడంతో అధికారులు, ప్రజలు అలర్ట్ అయ్యారు. రెండు సంవత్సరాల కిందట ఏ ప్రాంతంలో అయితే పెద్దపులి సంచరించిందో మరల అదే ప్రాంతంలో ఈ పెద్ద పులి తిరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది.