Headlines
Chandrababu pays tribute to Manmohan Singh mortal remains

మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి చంద్రబాబు నివాళి

lన్యూఢిల్లీ: ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, డాక్టర్ బైరెడ్డి శబరి కూడా మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. దేశానికి మన్మోహన్ అవిశ్రాంతంగా సేవలందించారని, ఆయన మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. మన్మోహన్ తన సుదీర్ఘ ప్రస్థానంలో అనేక ఉన్నత పదవులు చేపట్టారని, ఆయా పదవులను సమర్థవంతంగా నిర్వర్తించారని కీర్తించారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని చంద్రబాబు కొనియాడారు. ఉపాధి హామీ, ఆధార్, ఆర్టీఐ, విద్యా హక్కు చట్టం తీసుకువచ్చారని వెల్లడించారు.

కాగా, మాజీ ప్రధాని,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం అత్యంత బాధాకరమని షర్మిల అన్నారు. భారత దేశ ఆర్థికశిల్పి మరణం దేశానికి తీరని లోటని వివరించారు. రెండు పర్యాయాలు దేశ ప్రధానిగా, అంతకు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, మన దేశానికి అందించిన సేవలు అమూల్యమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This meatloaf recipe makes the best leftovers – mjm news. Advantages of overseas domestic helper. Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda.