Headlines
chandrababu

అమరావతి నిర్మాణానికి రూ. 2,723 కోట్ల పనులకు సీఎం గ్రీన్ సిగ్నల్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం, ప్రపంచ బ్యాంకు అండతో అమరావతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరుగులు పెట్టించే పనిలో ఉన్నారు. తాజాగా అమరావతిలో మరో రూ. 2,723 కోట్ల పనులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. సీఆర్డీయే 44వ సమావేశంలో ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు.
టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలి
జూన్ 12 నాటికి 1.18 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని రింగ్ రోడ్డు, విజయవాడ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. మరోవైపు, ఇప్పటి వరకు రూ. 47,288 కోట్ల విలువైన పనులకు సీఆర్డీయే ఆమోదం తెలిపింది. జగన్ అమరావతి అభివృద్ధికి ఏమాత్రం పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి రాగానే అమరావతి రాజధానిగా చేసేందుకు పనులు వేగంగా సాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *