Headlines
ap rains

ఏపీకి తప్పిన ముప్పు

ఆంధ్రప్రదేశ్‌కు వాయుగుండం ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. వాయుగుండం ప్రభావం తగ్గిపోవడంతో రాష్ట్ర ప్రజలు కొంత ఊరట పొందారు. అయితే, దీని ప్రభావంతో తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపింది. వాతావరణశాఖ సమాచారం ప్రకారం, తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని హెచ్చరికలు జారీచేసింది. సముద్రంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని సూచించింది.

ఇక, రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో నిన్న విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో జలప్రవాహాలు కూడా చోటుచేసుకున్నాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *