డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని తన రాజకీయ నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని హర్షించారు. 2018లో మన్యం ప్రాంతంలో పర్యటించిన పవన్, అక్కడి ప్రజలకు రోడ్ల నిర్మాణం వంటి కీలక మౌలిక సదుపాయాలను కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేసి, 19 పంచాయతీలకు రూ.40 కోట్ల నిధులు మంజూరు చేయడం ద్వారా మాట నిలబెట్టుకున్నారు.
రెండు నెలల క్రితం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంతో మన్యం ప్రాంతంలో రోడ్ల అభివృద్ధి పునఃప్రారంభమైంది. ఇది అక్కడి ప్రజలకు విశేష సౌకర్యం కల్పించడమే కాకుండా, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడుతోంది. ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వ పథకాల రూపకల్పనలో తన నిబద్ధతను చాటుకున్నారు పవన్. పవన్ కేవలం రోడ్ల పట్లే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంపై కూడా దృష్టి పెట్టారు. ఇకపై ప్రతి ఏడాది రూ.350 కోట్లు మంజూరు అయ్యేలా నేను చర్యలు తీసుకుంటాను అని భరోసా ఇచ్చారు. ఈ ప్రకటన స్థానిక ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ప్రజల అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. ఆయన మాటలకే కాదు, పనులకు కూడా ప్రాధాన్యం ఇస్తారనే నమ్మకం జనసేన శ్రేణులలో మరింత పెరిగింది. ఈ పరిణామాలు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని మరింత బలపరుస్తున్నాయి. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం నేతల్లో అరుదైన లక్షణం. దీని ద్వారా పవన్ కళ్యాణ్ తన నాయకత్వానికి మరింత ప్రజాదరణ పొందారు.