హైదరాబాద్ : నగరంలోని ప్రముఖ వాస్కులర్, ఎండోవాస్కులర్ & పొడియాట్రిక్ సర్జన్లలో ఒకరైన డాక్టర్ నరేంద్రనాధ్ మేడా ఇటీవల అత్యాధునిక ఇసావోట్ యొక్క ఓ -స్కాన్ ఎంఆర్ఐ ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇసావోట్ నుండి ఆయన ఆసుపత్రికి వచ్చిన ఈ ఎంఆర్ఐ , హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో రోగులకు అందించే సంరక్షణ ప్రమాణాన్ని మరింత పెంచింది. ఈ అధునాతన రోగనిర్ధారణ సాంకేతికత యంత్రం వల్ల మస్క్యులోస్కెలెటల్ మరియు మృదు కణజాల ఇమేజింగ్ యొక్క ఖచ్చితత్వం మరియు సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరచటం తో పాటుగా రోగులకు మరింత ఖచ్చితమైన రోగనిర్ధారణ మరియు మెరుగైన చికిత్సకు ఉపయోగపడుతుంది.
పొడియాట్రిక్ కేర్‌లో అత్యాధునిక ఆవిష్కరణలకు ఖ్యాతి గడించిన డాక్టర్ నరేంద్రనాధ్ మేడా, ఈ కొత్త ఎంఆర్ఐ గురించి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ “ఓ -స్కాన్ ఎంఆర్ఐ మెషిన్ పాడియాట్రిక్ రోగులకు ఒక గేమ్-ఛేంజర్ కానుంది. ఇది తొలిదశలోనే సంక్లిష్ట పరిస్థితులను నిర్ధారించి మెరుగైన చికిత్స అందించటానికి ఉపయోగపడుతుంది. ప్రభావవంతమైన చికిత్స మరియు రోగికి సానుకూల ఫలితాలను తీసుకురావటంలో ఇది కీలకం. ఈ మెషీన్‌తో, మేము మా రోగులకు వేగవంతమైన, మరింత ఖచ్చితమైన ఇమేజింగ్‌ను అందించగలము. తద్వారా చికిత్సలు మరియు ఖచ్చితమైన సమాచారం తో నిర్ణయాలు తీసుకోవటంలో మాకు సహాయపడుతుంది ” అని అన్నారు.
ఇసావోట్ ఆసియా పసిఫిక్ డయాగ్నోస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంట్రీ బిజినెస్ డైరెక్టర్ శ్రీ ధీరజ్ నాసా మాట్లాడుతూ “ఇసావోట్ యొక్క విప్లవాత్మక ఓ -స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడంలో డాక్టర్ నరేంద్రనాధ్ మేడాతో కలిసి పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అత్యాధునిక సాంకేతికత పొడియాట్రిక్ చికిత్స తీరును మార్చటంలో అత్యంత కీలకం కానుంది. పాదాల మరియు చీలమండ పరిస్థితులు నిర్ధారణలో అసమానమైన ఖచ్చితత్వాన్ని, వేగవంతమైన రోగనిర్ధారణ పరిస్థితులను అందిస్తుంది, చివరికి రోగుల సంరక్షణ మరియు చికిత్స ఫలితాలను మెరుగుపరుస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీలకు వైద్యపరమైన ఆవిష్కరణలు మరియు ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ఇసావోట్ ఎంఆర్ఓ ద్వారా కట్టుబడి ఉన్నాము. భారతదేశంలో పొడియాట్రిక్ కేర్‌లో ఒక ముఖ్యమైన ముందడుగుగా ఇది నిలుస్తుంది ” అని అన్నారు.
దాని సాటిలేని ఇమేజింగ్ సామర్థ్యాలతో పాటు, ఓ -స్కాన్ ఎంఆర్ఐ ఒక పేషంట్ కు అనుకూల సమన్వయము,క్రమబద్దీకరించబడిన వర్క్‌ఫ్లో మరియు గణనీయంగా తగ్గిన స్కాన్ టైమ్‌లను అందిస్తుంది, ఇది డాక్టర్ లకు మరియు రోగులకు స్పష్టమైన సమాచారం అందిస్తుంది. మస్క్యులోస్కెలెటల్ సమస్యలను తెలుసుకోవడం, మృదు కణజాల పరిస్థితులు ఇంటర్నల్ పరిస్థితి గుర్తించడం వరకు ఈ సాంకేతికత విస్తృత శ్రేణి రోగనిర్ధారణ ప్రక్రియలకు మద్దతు ఇస్తుంది.
ఇసావోట్ యొక్క ఓ -స్కాన్ ఎంఆర్ఐ అనేది రోగులకు మరియు డాక్టర్ల కు అనేక ప్రయోజనాలను అందించే ఒక అత్యాధునిక రోగనిర్ధారణ సాధనం. దీని వినూత్న లక్షణాలు రోగులు వారి రోగనిర్ధారణ ప్రక్రియలో అత్యధిక నాణ్యత సంరక్షణ, సౌకర్యం మరియు ఖచ్చితత్వాన్ని పొందేలా చూస్తాయి. ఈ ఎంఆర్ఐ వలన కలిగే ప్రయోజనాలు..
- ఖచ్చితమైన రోగనిర్ధారణ కోసం అత్యున్నత నాణ్యత కలిగిన ఇమేజింగ్
- రోగికి మెరుగైన సౌకర్యం
- మెరుగైన రోగి విశ్వాసం మరియు మనశ్శాంతి.
- స్పష్టమైన ఇమేజింగ్, తక్కువ స్కాన్ సమయాలు, మెరుగైన సౌలభ్యం మరియు తక్కువ ఇన్వాసివ్‌నెస్‌ని అందించడం ద్వారా, ఓ -స్కాన్ ఎంఆర్ఐ ద్వారా ఎంఆర్ఐ చేయించుకునే రోగులు సౌకర్యవంతంగా మరియు రిస్కులేని అత్యధిక ప్రమాణాలు సంరక్షణను పొందగలరని నిర్ధారిస్తుంది. ఇది మెరుగైన ఫలితాలు మరియు సంతృప్తిని కలిగిస్తుంది.