Headlines
img1

అక్రమంగా తరలిస్తున్న గోమాసం పట్టుబడిన కంటైనర్

అక్రమంగా తరలిస్తున్న గోమాసం.. పట్టుబడిన కంటైనర్. పాతిపెట్టిన పోలీసులు… ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు.!( నక్కపల్లి ,ప్రభాతవార్త) గుట్టుచప్పుడు కాకుండా జాతీయ రహదారి మీదుగా గోమాసాన్ని తరలిస్తుండగా నక్కపల్లి పోలీసులు కంటపడింది. పోలీసుల అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగరం సమీపంలో ఉన్న సంతపాలెం వద్ద నుంచి రాజమండ్రి వైపు మినీ కంటైనర్ లో 5000 కేజీలు తో వస్తున్న వాహనాన్ని రాబడిన సమాచారం మేరకు కుమార్ స్వామి నేతృత్వంలో ఎస్సై సన్నీ బాబు తో పాటు మిగతా సిబ్బంది మండలంలోని వేంపాడు టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. ఈ మేరకు సీఏకే. కుమారస్వామి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ గోమాంసం ఎవరికి తెలియకుండా తరలిద్దామనుకున్నారని, కానీ వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం ఉదయం వాహనాలు తనిఖీ చేయగా 5000 కేజీలున్న సుమారు 15 లక్షల విలువచేసే గోమాంసాన్ని తరలిస్తున్నట్లు గుర్తించమని చెప్పారు. డ్రైవర్ మణికంఠను విచారించగా 5 గురు వ్యక్తులు కలిసి ఈ మినీ కంటైనర్ లో ఈ మాంసాన్ని తరలించేందుకు సిద్ధమయ్యారని చెప్పినట్లు తెలిపారు. ఈ మేరకు స్థానిక వీఆర్వో రెవెన్యూ అధికారులు సమక్షంలో పంచిన నిర్వహించి 5000 కేజీల గోమాంసాన్ని ఎమ్మార్వో ఆఫీస్ సమీపంలో గల ఒక చెరువు వద్ద పాతి పెట్టడం జరిగిందని సీఐ కుమారస్వామి స్థానికులు తెలిపారు. ఈ మాంసాన్ని కొన్నవారు ఎవరు.. ఎక్కడికి పంపిస్తున్నారు. దీనిని ఎవరి ద్వారా కొన్నారు… వీటన్నిటి పైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని మణికంఠ ఇచ్చిన సమాచారం మేరకు ఐదుగురు వ్యక్తులను గుర్తించమని వారిపై కేసు నమోదు చేశామని విచారణ అనంతరం అరెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *