Headlines
AP Cabinet meeting today

నేడు ఏపీ కేబినేట్‌ మీటింగ్‌

అమరావతి: ఈరోజు ఏపీ కేబినేట్‌ మీటింగ్‌ జరుగనుంది. ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అమ‌రావ‌తిలో 20 వేల కోట్ల విలువైన ప‌నులకు పాల‌న‌ప‌ర‌మైన అనుమ‌తుల‌పై ఏపీ కేబినేట్‌ లో చర్చ‌ జరుగనుంది. ఇప్ప‌టికే సిఆర్డియో అధారిటీ అమోదించిన ప‌లు ప్రాజెక్ట్ ల అమోదం కోసం ఏపీ కేబినేట్‌ ముందుకు ప్ర‌తిపాద‌న‌లు వచ్చాయి. మంగ‌ళ‌గిరిలో ఉన్న ఎయిమ్స్ సంస్ధ‌కు మ‌రో ప‌ది ఎక‌రాలు భూ కేటాయింపు ప్రతిపాదనకు కూడా మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపే అవ‌కాశం ఉంది. వీటితో పాటు రెవెన్యూశాఖకు సంబంధించిన వివిధ ప్రతిపాదనలు కూడా గురువారం కేబినెట్ ముందుకు రానున్నాయి.

పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ లో చర్చ జరగనుంది. సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు, వాటి పురోగతిపై కేబినేట్‌లో చర్చించనుంది. అటు ఏపీలో పెట్టుబడుల అంశంపై ఏపీ కేబినేట్‌ లో చర్చ జరుగనుంది. అలాగే పెన్షన్ల కోతపై కూడా చర్చ జరుగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజ‌య‌వాడ బుడ‌మేరు ముంపు బాధితుల‌కు రుణాల రీ షేడ్యుల్ కోసం స్టాంపు డ్యూటీ మిన‌హాయింపు ఇచ్చారు. ప‌లు ప‌రిశ్ర‌మ‌ల‌కు భూ కేటాయింపులు చేయనున్నారు. రెవెన్యూ శాఖ నుంచి ఈ ప్ర‌తిపాద‌న మంత్రివ‌ర్గ స‌మావేశం ముందుకు రానుంది. అలాగే రాష్ట్రంలో ప‌లు ప్రాంతాల్లో ప‌రిశ్ర‌మ‌ల‌కు భూ కేటాయింపుల‌కు మంత్రివ‌ర్గం ఆమోదం తెలియచేసే అవకాశం ఉంది.

55 మీటర్లు ఎత్తులో నిర్మించే హైకోర్టు భ‌వ‌న నిర్మాణానికి రూ.1048 కోట్లు ఖర్చు కానుంది. వీటితో పాటు జీఎడీ టవర్, హెచ్ఓడీల టవర్లు మొత్తం ఐదింటిని నిర్మాణం చేయ‌నున్నారు. అన్ని టవర్లు కలిసి 68 లక్షల 88 వేల 64 చదరపు విస్తీర్ణంలో నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు. ఐదు టవర్ లకు గాను మొత్తంగా రూ. 4,608 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అన్ని టెండర్ లను డిసెంబర్ నెలాఖరుకు ముగించి పనులు చేపట్టేలా కేబినెట్ లో ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. 2025 జనవరి నుంచి రాజధాని నిర్మాణాలు పూర్తి స్ధాయిలో ప్రారంభం చేయాల‌న్న సీఆర్డిఏ ప్ర‌తిపాద‌న‌లకు మంత్రివ‌ర్గం ఆమోదం తెలపనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *