Headlines
Alla Nani

టీడీపీలో చేరనున్న ఆళ్ల నాని

వైసీపీకి దెబ్బమీదదెబ్బ తగులుతున్నాయి. ఈ పార్టీకి రాజీనామాల వరుసలు మొదలయ్యాయి. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రేపు టీడీపీలో చేరుతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు టీడీపీలో చేరుతున్నట్టు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు.
వైసీపీకి చెందినవారంతా కూటమిలో చేరేందుకు సిద్దపడుతున్నారు. వైసీపీ పార్టీ ప్రముఖులు టీడీపీ పార్టీలోకి వెళుతున్నారు. అయితే నాని టీడీపీలోకి రావడం పార్టీ శ్రేణులకు ఇష్టం లేదని… ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లానని చెప్పారు. కానీ, హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుందని, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. వైసీపీ కుటుంబానికి సన్నిహితులు, జగన్ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారని బడేటి చంటి అన్నారు.
రెండు నెలల క్రితం వైసీపీకి, పార్టీ పదవులకు ఆళ్ల నాని రాజీనామా చేశారు. పార్టీ పరంగా టీడీపీ ఎలాంటి హామీ ఇవ్వలేదని… ఆళ్ల నాని స్వచ్ఛందంగానే టీడీపీలో చేరుతున్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Told thomas edsall, “are much more tradition minded and authority minded” than white democrats. Fdh visa extension. Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda.