లోక్‌సభ ముందుకు జమి ఎన్నికల బిల్లు

one nation one poll to be introduced in lok sabha on december 16

న్యూఢిల్లీ: ఒకే దేశం- ఒకే ఎన్నికలు’ బిల్లు ఈ నెల 16న లోక్‌సభ ముందుకు రానుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెడుతున్నారు. దీంతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2024ను కూడామేఘ్​వాల్ ప్రవేశపెట్టనున్నారు.

లోక్​సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఈ నెల 12న కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో పాటు మూడు కేంద్రపాలిత ప్రాంతాలను అసెంబ్లీలతో అనుసంధానించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు సహా రెండు ముసాయిదా చట్టాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో జమిలి ఎన్నికల అమలులో ఓ కీలక ముందడుగు పడినట్లు అయింది. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం లోక్​సభ, అసెంబ్లీల ఏకకాల ఎన్నికలపై మాత్రమే కేంద్రం దృష్టి సారించింది. స్థానిక సంస్థలు ఎన్నికలకు సంబంధిచి ప్రస్తుతానికి దూరంగా ఉండాలని కేబినెట్ నిర్ణయించింది.

కాగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ జమిలి ఎన్నికలను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అంటూ ఘాటుగా విమర్శిస్తున్నాయి. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్​ సింగ్​ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. “ఒకవేళ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోయినా లేదా మెజారిటీ కోల్పోతే- ఆ రాష్ట్రం, ప్రభుత్వం లేకుండా మిగతా నాలుగున్నర సంవత్సరాలు ఉంటుందా? అది ఈ దేశంలో సాధ్యం కాదు. ఇప్పటివరకు ప్రభుత్వాలు తమ ఐదేళ్ల కాలాన్ని ఉపయోగించుకున్నాయి. కానీ ఇక ముందు కొన్ని ప్రభుత్వాలు రెండున్నరేళ్లకు, కొన్ని చోట్ల మూడేళ్లకు కూలిపోతాయి. 6 నెలల కన్నా ఎక్కువ సమయం ఏ రాష్ట్రంలోనూ ఎన్నికలు వాయిదా వేయకూడదు.” అని సింగ్ అన్నారు. జమిలి ఎన్నికల బిల్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని, దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ- జేపీసీకి పంపించాలని మరో కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Abu obeida, a spokesperson fоr hаmаѕ’ѕ armed wіng, ѕаіd in a ѕреесh оn thе аnnіvеrѕаrу оf thе 7 october аttасk thаt thе.    lankan t20 league. Mushroom ki sabji : 5 delicious indian mushroom recipes brilliant hub.