Atul Subhash Die Suicide

అతుల్ ఆత్మహత్య కేసులో పరారీలో భార్య

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో భార్య పరారీలో ఉంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అతుల్ సుభాష్ (34) ఆత్మహత్య కేసులో పోలీసులు రంగంలోకి దిగారు. భార్య, అత్తింటి వారి చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ అతుల్ రాసిన 40 పేజీల సూసైడ్ నోట్, 90 నిమిషాల వీడియో రికార్డింగ్ సంచలనమైంది. ఆత్మహత్య నోట్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టుకు పంపించాడు. వేధింపులకు గురవుతున్న భర్తలను కాపాడాలని అందులో అతుల్ వేడుకున్నాడు. తన భార్య, అత్తింటి వారితోపాటు తన ఆత్మహత్యతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేయాలని కోరాడు. విడాకుల సెటిల్‌మెంట్ కోసం రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అందులో సుభాష్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా రంగంలోకి దిగిన కర్ణాటక పోలీసులు అతుల్ అత్త నిషా సింఘానియా, ఆయన బావమరిది అనురాగ్ సింఘానియాను గత రాత్రి అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న అతుల్ భార్య నికిత సింఘానియా కోసం గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని జౌన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రశ్నించారు. అనంతరం కోర్టు అనుమతితో వారిని శుక్రవారం బెంగళూరుకు తరలిస్తున్నారు. తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టుఅతుల్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, సెక్షన్ 498ఏపై సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. ఈ సెక్షన్ దుర్వినియోగం అవుతున్నట్టు చెబుతూ విచారం వ్యక్తం చేసింది. భరణం విషయంలో 8 అంశాలను పరిగణనలోకి తీసుకోవాలంటూ మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఇలాంటి కేసులు పునరావృతం కాకుండా చూడాలని కోర్ట్ పేర్కొనింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Indoor digital tv antenna hdtv hd aerial. Advantages of overseas domestic helper. Were.