మీరు గురక సమస్యతో బాధపడుతున్నారా? గ్రీన్ టీ, తేనె మరియు ప్రాణాయామం వంటి సహజ మార్గాలు ఈ సమస్యను తగ్గించడంలో చాలా సహాయపడతాయి. తేనెలో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు జలుబును తగ్గించి, ఊపిరి తీసుకోవడంలో సౌకర్యాన్ని కల్పిస్తాయి. దీంతో గురక అనుభవాన్ని తగ్గించడం సులభం అవుతుంది.
ఉల్లిపాయలు కూడా గురకను తగ్గించడంలో ఉపయోగపడతాయి.అవి శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించి, గొంతులో నొప్పి లేకుండా సహాయపడతాయి. ప్రాణాయామం కూడా గురకను నియంత్రించడానికి ఎంతో ప్రభావవంతమైన మార్గం. ప్రాణాయామం ద్వారా శ్వాసక్రియపై పట్టు పెరిగిపోతుంది, తద్వారా ఊపిరి తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు.
ఈ యోగా ప్రక్రియ వల్ల శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందుతుంది. ఇది ఊపితిత్తులకు చాలా మంచిది. అదనంగా, శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది, శక్తి స్థాయి పెరుగుతుంది.ప్రాణాయామం ద్వారా మన శరీరంలో ఉన్న అనేక రుగ్మతలు దూరం అవుతాయి. నిద్రకు సంబంధించి కూడా కొన్ని అలవాట్లు మార్చుకోవడం ముఖ్యం.నిద్రకు ముందు ఆల్కహాల్ తీసుకోవడం మానేయడం శరీరానికి మంచిది.ఆల్కహాల్ నిద్రను భంగం చేస్తుంది, ఇది అలసటను కలిగిస్తుంది.ఈ సహజ మార్గాలను అనుసరించడం ద్వారా గురకను తగ్గించి, ఆరోగ్యకరమైన నిద్ర పొందవచ్చు.