త్వరలో అంతరిక్ష కేంద్రం సిద్ధం

indian space station 181852770 16x9


ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీలో వేగంగా డెవలప్ అవుతుంది. అందులో భాగంగా భారతదేశం 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకోనుందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. 2040 నాటికి చంద్రునిపై భారతీయులు కాలుమోపే అవకాశం ఉందన్నారు. గత పదేళ్లలో భారత అంతరిక్ష రంగం ఎంతో వేగంగా పురోగమించిందని, ఐరోపా ఉపగ్రహాలను నింగిలోకి పంపడం ద్వారా 260 మిలియన్‌ యూరోలను మన దేశం ఆర్జించినట్లు ఆయన తెలిపారు.

సొంత అంతరిక్ష కేంద్రం సిద్ధం
అంతరిక్ష రంగంలో ఎన్నో ఘన విజయాలు సాధించిన భారత్‌ ఇప్పుడు సొంతంగా అంతరిక్ష కేంద్రం నిర్మించుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. 2035 కల్లా భారత్‌ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని సిద్ధం చేసుకోనుందని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ స్పష్టం చేశారు. 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు కాలుమోపే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అంతరిక్ష మంత్రిత్వశాఖలు ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలపై విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించిన విషయాలను సైతం జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. 2025 చివరికి లేదా 2026 ప్రారంభంలో మొదటి భారతీయ వ్యోమగామి గగన్‌యాన్ మిషన్ కింద అంతరిక్షంలోకి వెళతారని ఆయన వెల్లడించారు.

త్వరలో మత్స్య-6000 జలాంతర్గామి
భారత్‌ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్‌ ఓషన్‌ మిషన్‌ సముద్రయాన్‌లో భాగంగా మత్స్య-6000 జలాంతర్గామిని రూపొందిస్తున్నట్లు జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ​ జలాంతర్గామిలో ముగ్గురు కూర్చొని సముద్రంలో 6 కి.మీ గరిష్ఠ లోతు వరకు చేరుకోవచ్చని, దీని వల్ల సముద్ర వనరులు, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయొచ్చని తెలిపారు. సముద్రగర్భ అన్వేషణలో తోడ్పడే మానవ సహిత జలాంతర్గామి ఇదేనని చెప్పారు. ఈ నౌకను చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ అభివృద్ధి చేసిందన్నారు. ఇది ప్రారంభమైతే భారతదేశ మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణ మిషన్‌గా దీనికి గుర్తింపు దక్కనుందని ఆయన పేర్కొన్నారు.
ఎన్​డీఏ ప్రభుత్వ హయాంలో ఉపగ్రహ ప్రయోగాల్లో భారత్‌ గణనీయమైన పురోగతిని సాధించిందని జితేంద్రసింగ్‌ తెలిపారు. ఇప్పటి వరకు భారతదేశం శ్రీహరికోట నుంచి 432 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించిందని, వాటిలో 90 శాతం అంటే 397 ఉపగ్రహాలను గత దశాబ్దంలోనే ప్రయోగించామని పేర్కొన్నారు. గత పదేళ్లలో ఐరోపా ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి పంపడం ద్వారా భారత్‌ 260 మిలియన్‌ యూరోలను ఆర్జించిందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Life und business coaching in wien – tobias judmaier, msc.    lankan t20 league.