- మీడియా ముందు భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్న మనోజ్
హైదరాబాద్:
సినీ నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. మంగళవారం జరిగిన ఘటనకు తాను బాధపడుతున్నట్లు ప్రకటించారు. మీడియా మిత్రులకు తన తండ్రి మోహన్ బాబు అన్న విష్ణు తరపున క్షమాపణ చెబుతున్నట్లు నటుడు మంచు మనోజ్ తెలిపారు. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఎప్పుడూ తోడుంటానని చెప్పారు. తాను తన కుటుంబ సభ్యులను ఏమీ అడగలేదని, ఇంట్లో వాళ్ల ఆదాయం మీద ఆధారపడలేదని సొంతకాళ్లపై పనిచేసుకుంటున్నానని వివరించారు. ఈ వివాదంలోకి నా భార్య, ఏడు నెలల కుమార్తెను లాగుతున్నారని, నా భార్య వాళ్లింట్లోనూ ఏమీ అడగలేదని చెప్పారు. సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్నాం. ఆస్తికోసం మా నాన్నతో గొడవ పడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. మా నాన్న దేవుడు.. కానీ.. ఈరోజు చూస్తున్నది మా నాన్నను కాదు. ఇవాళ పోలీసుల విచారణకు హాజరవుతాను. పోలీసుల విచారణ తర్వాత మిగతా విషయాలు వెల్లడిస్తానని మనోజ్ వ్యాఖ్యానించారు.