రాజ్యసభకు కుటమి అభ్యర్దుల నామినేషన్

rajyasabha

రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేస్తున్న టీడీపీ అభ్యర్థులు సానా సతీష్, బీదా మస్తాన్రావు, బిజెపి అభ్యర్థి ఆర్. కృష్ణయ్య

మూడు రాజ్యసభ ఎంపి సీట్లకు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు

బిజెపి అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య, టీడీపీ అభ్యర్థులుగా సానా సతీష్, బీదా మస్తాన్ రావు

విజయవాడ, డిసెంబరు 10, ప్రభాతవార్తప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభలో ఖాళీ అయిన మూడు ఎంపి స్థానాల భర్తీకి సంబంధించి టిడిపి అభ్యర్థులుగా బీద మస్తాన్ రావు, సానా సతీష్ బాబు, బిజెపి తరుపువ ఆర్. కృష్ణయ్యలు నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం అసెంబ్లీ భవనంలో రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్. వనితా రాణి వద్ద రాజ్యసభ ఎంపి అభ్యర్ధులుగా వారు నామినేషన్లను దాఖలు చేశారు. మూడు రాజ్యసభ స్థానాలకు ముగ్గురు అభ్యర్ధులే నామినేషన్ల దాఖలు చేయడంతో నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణల గడువు అనంతరం వారి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈనామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు తరపున ఆయా పార్టీల ప్రతినిధులుగా రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, కె.అచ్చన్నాయుడు. పి. నారాయణ, పలువురు ఎంఎల్ఎలు తదితరులు పాల్గొన్నారు. ఇక నామినేషన్లు దాఖలు అనంతరం బీదా మస్తాన్ రావు, సానా సతీశ్, ఆర్. కృష్ణయ్య మీడియాతో • మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ అన్ని రంగాల్లో ముందుకెళ్లేందుకు ప్రయత్నం జరుగుతుందని, వారికితోడు మేముకూడా తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు. రాజ్యసభ సభ్యులుగా తమకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ తరుపున రాజ్యసభ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ఆర్. కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీలో ఉన్నా నేను బీసీల సంక్షేమంకోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. నేను ఏ పార్టీలోకి వెళ్లలేదు.. నన్ను పిలిచి సీటిచ్చారని పేర్కొన్నారు. నేను ఏ పార్టీలో ఉన్నా బీసీల కోసమే పోరాడతా.. అవకాశం ఉన్నప్పుడు పార్టీకోసం పనిచేస్తానని చెప్పారు. బీజేపీయే తనను ఆహ్వానించి రాజ్యసభ సీటు ఇచ్చిందని ఆర్. కృష్ణయ్య తెలిపారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీ పీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఆర్. కృష్ణయ్య అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2024 2028 asean eye. Truecaller appoints ogochukwu onwuzurike as country manager for nigeria biznesnetwork. Life und business coaching in wien – tobias judmaier, msc.