జనవరి 10 నుండి వైకుంఠద్వారదర్శనం

thirumala

-10న వైకుంఠ ఏకాదశి, 11న ద్వాదశి

  • రానున్న ఏడాదిలోనూ పదిరోజుల వైకుంఠద్వార దర్శనాలు

తిరుమల, డిసెంబర్ 10 ప్రభాతవార్త ప్రతినిధి:

ప్రముఖ వైష్ణవాలయాలలో వైకుంఠద్వార దర్శనాలకు సమయం సమీపిస్తోంది. పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా, ద్వాదశిని వైకుంఠద్వాదశిగా ప్రసిద్ధి. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మోక్షమార్గం వైకుంఠద్వారం రానున్న జనవరి 10వతేదీ తెల్లవారుజామున 1.45 గంటలకు తెరచుకోనుంది. రానున్న ఏడాదిలో కూడా పదిరోజులుపాటు వైకుంకద్వారం తెరచి భక్తులకు మోక్షమార్గం దర్శనం చేయించేలా టిటిడి ఇఒ శ్యామలరావు, అదనపు చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పదిరోజులపాటు దాదాపు 7 లక్షలమంది భక్తులు ఆరోజుల్లో వైకుందద్వార దర్శనం చేసుకునేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేయనుంది. జనవరిలో వైకుంఠ ద్వారం తెరచి ఉంచే 10వతేదీ నుండి జనవరి 19వరకు పదిరోజుల పాటు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరు. దర్శన టిక్కెట్, టోకెన్లు లేని భక్తులను ఆలయంలోపలకు అనుమతించరు. రాజ్యాంగపరిధిలోని ప్రొటోకాల్ విఐపీలు స్వయంగా వస్తేనే పరిమితంగా బ్రేక్ దర్శనాలు జారీచేస్తారు. ప్రత్యేక దర్శనాలు చంటిపిల్లలు, దివ్యాంగులు, వృద్ధులు, ఎన్ఆర్వలు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దుచేశారు. వైకుంఠద్వార దర్శనాలకు సంబంధించి 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం. శ్రీవాణి ట్రస్ట్, తిరుపతిలో ఆన్లైన్లో టోకెన్లు జారీచేయనున్నారు.

-జనవరి 10న స్వర్ణరథం, 11న చక్రస్నానం:

పవిత్రమైన ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన జనవరి 10వతేదీ శుక్రవారం ఉదయం 9గంటల నుంచి 10గంటల వరకు స్వర్ణరథం జరుగుతంది. శ్రీదేవిభూదేవిసమేతంగా మలయప్పస్వామివారు విశేష అలంకరణలో స్వర్ణరథాన్ని అధిరోహించి. ఆలయ మాధవీడుల్లో ఊరేగనున్నారు. 11వతేదీ ద్వాదశిరోజు పవిత్ర పుష్కరిణిలో స్వామివారి చక్రత్తాశ్వార్కు చక్రస్నాన మహోత్సవం జరిపిస్తారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The promising future of decentralized finance (defi). Ghana launches mycredit score to improve access to credit and boost financial inclusion. The technical storage or access that is used exclusively for statistical purposes.