‘గ్రోమర్ రైతు సంబరాలు’.. రైతుల కష్టాన్ని గౌరవించిన కోరమాండల్ ఇంటర్నేషనల్

'Growmer Farmer Celebrations'.. Coromandel International

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన మెగా లక్కీ డ్రా విజేతలకు ట్రాక్టర్లు మరియు మోటర్ సైకిళ్లను బహుకరించారు..

హైదరాబాద్ : భారతదేశంలోని సుప్రసిద్ధ వ్యవసాయ పరిష్కారాల ప్రదాత కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, హైదరాబాద్‌లో జరిగిన గ్రోమర్ రైతు సంబరాలు మెగా లక్కీ డ్రా విజేతలకు బహుమతులు అందజేయటంతో పాటుగా వేడుకలు చేసుకోవడం ద్వారా రైతు సమాజంతో తన శాశ్వత భాగస్వామ్యాన్ని బలోపేతం చేసింది. భారతదేశ వ్యవసాయ పురోగతిని రూపొందించడంలో కీలక పాత్ర పోషించినందుకు ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రైతులకు ట్రాక్టర్లు మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటర్‌సైకిళ్లను ప్రదానం చేశారు.

రైతులు, ఛానెల్ భాగస్వాములు మరియు సీనియర్ కంపెనీ అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమం, రైతుల ఆకాంక్షలకు మద్దతు ఇవ్వడం మరియు వ్యవసాయ వృద్ధిని ప్రోత్సహించడంలో కోరమాండల్ యొక్క స్థిరమైన నిబద్ధతను ప్రతిబింభించింది. కోరమాండల్ యొక్క గ్రోమోర్ ఎరువులను కొనుగోలు చేసిన రైతుల కోసం లక్కీ డ్రాతో కూడిన గ్రోమర్ రైతు సంబరాలు కార్యక్రమం, వినూత్న పరిష్కారాలను అందించడం మరియు రైతుల సహకారాన్ని గుర్తించడం ద్వారా రైతులతో అర్ధవంతమైన సంబంధాలను పెంపొందించడంలో కోరమాండల్ యొక్క అంకితభావాన్ని నొక్కి చెబుతుంది.

విజేతలుగా నిలిచిన ఆంధ్ర ప్రదేశ్ నుండి శ్రీధర్ మరియు తెలంగాణ నుండి శ్రీ మొఘల్ బాషాలకు ట్రాక్టర్లను కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ శ్రీ ఎస్ శంకరసుబ్రమణియన్ అందజేశారు. కంపెనీ ఉన్నతాధికారులు శ్రీ అమీర్ అల్వీ, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ – ఫర్టిలైజర్, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, శ్రీ మాధబ్ అధికారి, విపి , సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ – ఫర్టిలైజర్స్ &ఎస్ ఎస్ పి , కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, మరియు శ్రీ జి వి సుబ్బారెడ్డి, విపి , డి ఎన్ హెచ్ – సౌత్ 1, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లు రెండు రాష్ట్రాల నుండి విజేతలుగా నిలిచిన ఎనిమిది మంది రైతులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సిఇఒ శ్రీ ఎస్ శంకరసుబ్రమణియన్ మాట్లాడుతూ, “మన వ్యవసాయ పర్యావరణ వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న రైతుల అచంచలమైన అంకితభావాన్ని జరుపుకోవడం మాకు గౌరవంగా ఉంది. ఈ కార్యక్రమం, మన వ్యవసాయ సమాజంతో మేము పంచుకుంటున్న బలమైన సంబంధానికి నిదర్శనం మరియు వినూత్న పరిష్కారాలు మరియు నిరంతర మద్దతు ద్వారా వారిని శక్తివంతం చేయాలనే కోరమాండల్ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మేము విజేతలను అభినందిస్తున్నాము మరియు తమ నమ్మకం మరియు సహకారం అందించిన రైతులందరికీ ధన్యవాదాలు. వ్యవసాయ కమ్యూనిటీని వేడుక జరుపుకోవడానికి మరియు మద్దతు ఇవ్వడానికి మరిన్ని అవకాశాల కోసం కంపెనీ ఎదురుచూస్తోంది..” అని అన్నారు.

ఈ కార్యక్రమం విజేతలను సన్మానించే వేదిక మాత్రమే కాకుండా కోరమాండల్ మరియు రైతు సమాజానికి మధ్య ఉన్న ముఖ్యమైన సంబంధాన్ని వేడుక చేసుకునే ఉత్సవంగా నిలిచింది. తమ వ్యవసాయ పద్ధతులు మరియు జీవనోపాధిని కంపెనీ యొక్క కార్యక్రమాలు సానుకూలంగా ఎలా ప్రభావితం చేశాయో వెల్లడిస్తూ కోరమాండల్ యొక్క నిరంతర మద్దతుకు రైతులు తమ కృతజ్ఞతలు తెలిపారు. అవార్డుల వేడుకతో పాటు, కోరమాండల్ తమ నూతన నానో డిఏపి, నానో యూరియా మరియు గ్రోమోర్ డ్రైవ్ డ్రోన్ సర్వీసెస్‌తో సహా దాని యొక్క ఆఫర్‌లను ప్రదర్శించింది, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం మరియు రైతుల ఉత్పాదకత మరియు శ్రేయస్సును పెంచడంలో తన లక్ష్యాన్ని నొక్కి చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Halal food malaysia tourism. Ghana launches mycredit score to improve access to credit and boost financial inclusion. Life und business coaching in wien – tobias judmaier, msc.